సాంకేతిక లోపంతో నిలిచిన 'శాతవాహన ఎక్స్‌ప్రెస్'
విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఉదయం సాంకేతికలోపం ఏర్పడింది. దాంతో ఖమ్మం జిల్లాలోని మొటుపర్రు వద్ద ఆ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. దీంతో విజయవాడ - వరంగల్ మధ్య పలు రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులే కాకుండా పలు రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే సమాయత్తమైంది. శాతవాహనలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సవరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సాంకేతి బృందం హుటాహుటిన మోటుపర్రుకు పయనమైంది.