mourn
-
దిగ్గజ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూత
ముంబై: ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో అలరించిన గజల్ గాయకుడు భూపీందర్ సింగ్(82) ఇక లేరు. సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కోలన్ కేన్సర్, కోవిడ్ అనంతర సమస్యలతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మోహమ్మద్ రఫీ, ఆర్డీ బర్మాన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, గుల్జర్లకు సమకాలీకుడు ఈయన. ఆయన భార్య ప్రముఖ గాయకురాలు మిథాలీ సింగ్. ధరమ్‌కాంటా చిత్రంలోని ధునియా ఛూటే.. యార్ నా ఛూటే, సితారా చిత్రంలో ‘థోడీ సీ జమీన్ థోడా ఆస్మాన్’ పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నామ్ గుమ్ జాయేగా, దిల్ థూండ్తా హై.. మరిచిపోలేని క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. యూరిన్ ఇన్ఫెక్షన్తో పది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన భూపీందర్కు.. ఆ తర్వాత కొవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే కోలన్ క్యాన్సర్, కొవిడ్ ఎఫెక్ట్‌తో ఆయన సోమవారం రాత్రి 8గం. ప్రాంతంలో మరణించారని వైద్యులు తెలిపారు. భూపీందర్‌సింగ్ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు మదన్ మోహన్ దృష్టిలో పడి సినిమా అవకాశాలు అందుకున్నారు. 1964లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన హఖీఖాత్ ఆయన తొలి చిత్రం. అయితే ఆయన సోలో ట్రాక్ మాత్రం రెండేళ్ల తర్వాత ఆఖ్రీ ఖాట్ చిత్రంలోనే(రుత్ జవాన్ జవాన్ రాత్ మెహర్బాన్...) పాడారు. 1980లో సినిమాలకు మెల్లిగా దూరం అవుతూ వచ్చిన ఆయన.. భార్య మిథాలీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు. కేవలం సింగర్‌గానే కాకుండా.. గిటారిస్ట్‌గా హరే రామా హరే కృష్ణ చిత్రంలో ‘దమ్ మారో దమ్’, యాదోన్ కీ బారాత్ చిత్రంలో ‘చురా లియా హై’, ‘చింగారి కోయ్ భడ్కే’, షోలే చిత్రంలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌కు పని చేశారు. ఈ పాటల్లో గిటార్ మ్యూజిక్‌లు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భూపీందర్ సింగ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఈ మేరకు ఓ సంతాప ప్రకటన విడుదల చేశారు. -
బిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలింది!
Karnataka Beggar Death: అంతిమ సంస్కారం.. ఇది జీవితంలో చివరి ఘట్టం. ముఖ్యమైన ఘట్టం. మన పుట్టుక ఎలా ఉంది.. మధ్యలో ఎలా బ్రతికాం అన్నది కాదు.. చివరి శ్వాస వదిలేసినప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఇక్కడ ధనిక, బీదా అనే తేడా ఉండదు. ధనం ఉన్నవారికి కాస్త గ్రాండ్ అంతిమ వీడ్కోలు పలికితే, బీద వారు వారు స్థాయికి తగ్గట్టే ఆ తుది ఘట్టాన్ని పూర్తి చేస్తారు. మరి ఎటుకాని బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్ సిబ్బందే తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫలానా బిచ్చగాడు చనిపోయాడంటే సాధారణంగా జనం కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక యాచికుడ్ని ఊరంతా సొంతం చేసుకుంది. అతని అంతిమయాత్రలో అడుగులో అడుగై నడిచింది. అతని అమాయకపు నవ్వును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అతన్ని గుండెల్లో పెట్టుకుని ఘనంగా వీడ్కోలు పలికింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయనగర జిల్లాలోని హవినహడగలిలో హుచ్చబస్య అనే యాచకుడు మరణించాడు. అతని మృతిని తెలుసుకున్న హవినహడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమ యాత్ర చేశారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. హుచ్చబస్య పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నివశిస్తున్నాడు. దివ్యాంగుడైన అతను పట్టణంలో ప్రతి ఒక్కరికి హుచ్చబస్య గురించి బాగా సుపరిచితుడు. అందర్ని పలకలరిస్తూ కేవలం రూపాయి మాత్రమే యాచించి తీసుకునేవాడు. అంతకంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహ్యించుకునే సందర్భాలే ఎక్కువ కానీ హచ్చబస్యకు రూపాయి ధర్మం చేయడం వలన మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన.. అందుకే హచ్చబస్య కనిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్కడి ప్రజలు. ఇక ఆలయాల్లో లేదా స్కూళ్లలో తలదాచుకునేవాడు. అయితే, ఇటీవల అతను రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఎవరు కనిపించినా పేరుపెట్టి పిలిచి రూపాయి ధర్మం అడిగి తీసుకునేవాడట హచ్చబస్య. ఆయన్ను అక్కడ అంతా అదృష్ట బస్య అని పిలుచుకునేవారు. ఒక బిచ్చగాడు మరణంలో అశేషమైన జనాన్ని సంపాదించుకోవడం చర్చనీయాంశమైంది. -
కుల్దీప్ కన్నుమూత
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన కలం మూగబోయింది. పత్రికా స్వేచ్ఛకోసం అహర్నిశలు శ్రమించడంతోపాటు మానవహక్కులకోసం పోరాడిన గొంతుక ఇక సెలవంటూ వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుల్దీప్ నయ్యర్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న నయ్యర్‌ను ఐదురోజుల క్రితం ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛపై ఎడతెగని పోరాటం చేసిన వ్యక్తిగా నయ్యర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత్–పాక్ మధ్య శాంతి నెలకొల్పే విషయంలోనూ తనవంతు ప్రయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో 1923లో జన్మించిన నయ్యర్.. ఉర్దూ పత్రికతో జర్నలిజం వృత్తిని ప్రారంభించారు. తర్వాత పలు ఇంగ్లిష్ పత్రికలకు ఎడిటర్‌గా సేవలందించారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఎడిటర్స్ గిల్డ్, రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. నిర్భయంగా భావాల వ్యక్తీకరణ కుల్దీప్ నయ్యర్ జర్నలిస్టుగానే ఎక్కువగా పరిచితులైనా మానవహక్కుల న్యాయవాదిగా, బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా, రచయితగా సేవలందించారు. ఎమర్జెన్సీకాలంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించినందుకు అరెస్టై జైలుకు వెళ్లారు. ‘ఎమర్జెన్సీ సందర్భంగా కుల్దీప్‡ ప్రజాస్వామ్య చాంపియన్‌గా నిలిచారు. పాఠకులకు ఆయన మృతి తీరనిలోటు’ అని రాష్ట్రపతి కోవింద్ సంతాపసందేశంలో పేర్కొన్నారు. ‘మా కాలంలో కుల్దీప్ ఓ గొప్ప రచయిత, మేధావి. నిర్భీతితో తన అభిప్రాయాలను వెల్లడించడంలో దిట్ట. దశాబ్దాలుగా తన కలంతో ఎందరో పాఠకులను చైతన్యవంతులను చేశారు. ఎమర్జెన్సీలో పట్టుదలగా వ్యవహరించిన తీరు, భవ్యభారతం కోసం ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని దేశం ఎన్నటికీ మరవదు.’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రేరణ నయ్యర్ న్యూస్ స్కూప్స్ యువ జర్నలిస్టులకు ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. విశ్వసనీయతను కాపాడుకుంటూ వేగంగా, చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు అవసరమైన వార్తలందించే విషయంలో నయ్యర్ స్ఫూర్తిదాయకంగా ఉండిపోతారని సంతాప సందేశంలో పేర్కొంది. ‘రిపోర్టర్ల ఎడిటర్’గా నయ్యర్‌ను కీర్తించింది. ఎడిటర్స్ గిల్డ్‌కు కుల్దీప్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మానవహక్కులు, మీడియా స్వేచ్ఛను కాపాడటంలో నయ్యర్ పాత్ర మరువలేనిదని ‘ద వీక్’ మ్యాగజీన్ ఎడిటర్ సచ్చిదానంత మూర్తి గుర్తుచేసుకున్నారు. 1980ల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరువునష్టం దావా బిల్లును నయ్యర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘బిట్వీన్ ద లైన్స్’ పేరుతో నయ్యర్ తన భావాలను ధైర్యంగా వ్యక్తపరిచిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఎంలు నయ్యర్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. ‘వివిధ హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. జర్నలిస్టుగా, దౌత్యవేత్తగా, పార్లమెంటేరియన్‌గా, రచయితగా దశాబ్దాల ప్రజాజీవితంలో ఎన్నో గొప్ప శిఖరాలను చేరుకున్నారు’ అని మన్మోహన్ సింగ్ అన్నారు. ‘పాత్రికేయ రంగంలో ఓ శకం ముగిసింది. నయ్యర్ ప్రజాస్వామ్యానికి అసలు సిసలు సైనికుడు’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ కూడా నయ్యర్ మృతిపట్ల సంతాపం తెలిపారు. అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతోపాటు రాజకీయ, మీడియా ప్రముఖులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టుకు కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్, ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ తదితరులు పాల్గొన్నారు. జగమెరిగిన జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్! నాలుగు దశాబ్దాల పాత్రికేయ జీవితం బహుముఖ ప్రజ్ఞాశాలి న్యూఢిల్లీ: 1923 ఆగస్టు 14న నాటి బ్రిటిష్ హయాంలోని పంజాబ్ సియాల్కోట్లో (ప్రస్తుత పాక్‌లో) జన్మించిన నయ్యర్ చిన్నతనమంతా అక్కడే గడిచింది. లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశాక, లాహోర్‌లోనే న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన మారణహోమానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచారు. 1952లో అమెరికా ఇలినాయిస్ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజం కోర్సు పూర్తిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఉర్దూ పత్రిక ‘అంజామ్’లో పాత్రికేయ వృత్తిని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఇంగ్లిషు జర్నలిజంలోకి ప్రవేశించారు. దేశంలోని వివిధ మీడియాసంస్థలు, ఏజెన్సీలకు సేవలందించారు. లండన్‌కు చెందిన ‘ద టైమ్స్’ ప్రతినిధిగా రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయరంగంలో సాగిన పయనంలో ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ద స్టేట్స్‌మన్’ తదితర పత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. భారత్–పాక్ స్నేహబంధం కోసం.. 1990లో వీపీసింగ్ ప్రభుత్వం ఆయన్ను ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. 1997లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత–పాకిస్తాన్ల మధ్య స్నేహసంబంధాలు ఏర్పడేందుకు, రెండుదేశాల మధ్య మానవహక్కులు, శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు. పాత్రికేయ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2015లో రామ్‌నాథ్ గోయంకా జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ‘వితవుట్ ఫియర్, బియాండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ రీ టోల్డ్, స్కూప్: ఇన్సైడ్ స్టోరీస్ ఫ్రం పార్టిషన్ టు ద ప్రెజెంట్’, ‘డిస్టెంట్ నైబర్స్: ఏ టేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్’ వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించారు. భారతీయ యువతపై భగత్ సింగ్ ప్రభావం ఎలా ఉందో ‘వితవుట్ ఫియర్’ పుస్తకంలో వివరించారు. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్గురుల స్వాతంత్య్ర పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హన్స్‌రాజ్ వోహ్రా భగత్‌సింగ్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడన్నది వివరించారు. నయ్యర్ చివరి వ్యాసంలో.. చనిపోయేందుకు కొద్ది గంటలముందు కూడా మోదీ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ లోక్మత్ టైమ్స్‌కు నయ్యర్ ఓ వ్యాసం రాశారు. కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో హిందుత్వ భావాలను రుద్దకుండా అభివృద్ధి సుపరిపాలనపైనే దృష్టిపెట్టాలని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు అక్రమ వలసలు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ అని.. దీనిపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఆర్టికల్‌ను గురువారం నాగ్‌పూర్ ఎడిషన్ లోక్మత్ టైమ్స్ ‘శరణార్థులా? ఓటుబ్యాంకా?’ శీర్షికతో ప్రచురించింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్యరాష్ట్రాల్లోని 25 ఎంపీ సీట్ల విషయంలో మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని నయ్యర్ సూచించారు. వాజ్‌పేయి మృతిచెందిన తర్వాత ఆయనకు నివాళులర్పిస్తూ నయ్యర్ ఓ వ్యాసం రాశారు. దీన్ని పత్రికలకు పంపాల్సి ఉంది. ఇంతలోనే నయ్యర్ కన్నుమూశారు. వాజ్‌పేయి నయ్యర్ ఇద్దరూ 1920వ దశకంలోనే పుట్టారు. వారం రోజుల్లోనే కన్నుమూయటం యాదృచ్ఛికం. మృతిపై కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత, జర్నలిస్టు, మాజీ ఎంపీ కుల్దీప్నయ్యర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. సామాజిక, రాజకీ య, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై కుల్దీప్ నయ్యర్ చేసిన అధ్యయనం, రచనలు భారత సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని వెల్లడించారు. మానవ హక్కులు, శాంతి ఉద్యమకారుడిగా కుల్దీప్నయ్యర్కు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ గుర్తింపు ఉందని సీఎం పేర్కొన్నారు. కుల్దీప్ మృతికి జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై మంచి పట్టు, సరైన అవగాహన కలిగిన నయ్యర్ తన రచనల్లో వాటిని ప్రతిబింబింపజేసే వారని జగన్ కొనియాడారు. మానవహక్కుల కార్యకర్తగా ఆయన తన రచనలతో ఎంతో మంది యువకులను ప్రభావితం చేశారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారతదేశం తరపున బ్రిటన్‌కు హైకమిషనర్ హోదాలో పనిచేసినప్పటికీ నయ్యర్ క్షేత్ర స్థాయి వాస్తవాలకు దగ్గరగా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. -
లెజెండరీ సింగర్ కన్నుమూత
లెజెండరీ సింగర్ అరెతా ఫ్రాంక్లిన్ (76) కన్నుమూశారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె డెట్రాయిట్‌లోని తన ఇంటిలో ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. మార్చి 25, 1942న పుట్టిన అరేత లూయిస్ ఫ్రాంక్లిన్ 14 ఏళ్ళ వయసులోనే మొదటి ఆల్బం "ది గాస్పల్ సౌండ్ అఫ్ అరేతా ఫ్రాంక్లిన్" ను విడుదల చేశారు. తన మొదటి ఆల్బంతోనే సంగీతప్రియులకు ఉర్రూత లూగించారు. మహిళల హక్కుల కోసం "రెస్పెక్ట్" (1967) గీతంతో బాగా పాపులర్ అయ్యారు. 1968లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంత్యక్రియలలో ఫ్రాంక్లిన్ "ప్రియస్ లార్డ్, టేక్ మై హ్యాండ్" పాట, అమెరికా అధ్యక్షుడి బరాక్ ఒబామా ప్రమాణీస్వీకార ఉత్సవ వేడుకల్లో "మై కంట్రీ," "ఈస్ ఆఫ్ థీ" ఆమె కరియర్లో మైలురాళ్లు. అంతేకాదు ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రభావవంతమైన కళాకారులు అందుకునే రాక్ హాల్ ఆఫ్ ఫేమ పురస్కారాన్ని అందుకున్నతొలి మహిళ. 18 గ్రామీ అవార్డులను అందుకున్నారు. అరెతా మృతిపై పలువురు సెలబ్రిటీలు, ఇతర గాయకులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆమె లేకుండా ప్రపంచాన్ని ఊహించటం కష్టం, ఆమె ఒక ప్రత్యేకమైన గాయకురాలు మాత్రమే కాదు, పౌర హక్కులకు, మహిళాసాధికారత కోసం పనిచేసిన గొప్ప మనిషి. ఆమె నిబద్ధతతో ప్రపంచంపై చెరగని ప్రభావాన్ని చూపించారంటూ బార్బ్రా స్ట్రీసాండ్, జాన్ లెజెండ్ తదితరులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందిస్తూ సంగీతం ద్వారా ఆమె ప్రపంచానిచ్చారు. ఆమె స్వరం మనకు ఊతమిస్తూనే వుంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ఆమె కుటుంబానికి, అభిమానులకు సానుభూతిని ప్రకటించారు. We mourn the passing of Aretha Franklin, the Queen of Soul. Her voice will keep lifting us, through the music she gave the world. Our thoughts are with her family, her loved ones and fans everywhere. Take her hand, precious Lord, and lead her home. 🎶 pic.twitter.com/I84HTEVZU1 — Tim Cook (@tim_cook) August 16, 2018 This photo was taken in 2012 when Aretha & I performed at a tribute celebration for our friend Marvin Hamlisch. It’s difficult to conceive of a world without her. Not only was she a uniquely brilliant singer,but her commitment to civil rights made an indelible impact on the world pic.twitter.com/Px9zVB90MM — Barbra Streisand (@BarbraStreisand) August 16, 2018 -
9 ఏళ్లక్రితం ఆయన...ఇపుడు వినోద్‌జీ
ముంబై: సుమారు 100పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, యాక్టివ్ పోలిటీషియన్ వినోద్ ఖన్నా (70) ఇక లేరన్న వార్త తో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. శ్వాసకోశ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినోద్ ఖన్నా గురువారం ఉదయం 11.20గంగలకు అంతిమ శ్వాస విడిచారని హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.తీవ్ర అనారోగ్యంతో ఏప్రిల్‌లో మొదటి వారంలో సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటలో చేరారు. తమ అభిమాన, సహచర నటుడు కన్నుమూతతో బాలీవుడ్ గుండె బరువెక్కింది. అశ్రునయనాలతో ఆయనకు నివాళులర్పించారు. ముఖ్యంగా కేంద్రమంత్రి, నటి స్మృతి ఇరాని వినోద్ ఖన్నా ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసినగౌరవం తనకు దక్కిందని ఆమె గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ మరో సీనియర్ నటుడు రిషీకపూర్ అమర్ అక్బర్, ఆంటోనీ సినిమాలో అమర్ పాత్ర పోషించిన వినోద్‌కు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే హీరోయిన్ రాధిక, రిచా చద్దా తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. పంజాబ్ గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు బీజీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘‘మేరె అప్నే’ "ఇన్సాఫ్" "అమర్, అక్బర్ ఆంటోనీ, లాంటి సినిమాలతో ఆయన పాపులర్ అయ్యారు. వినోద్ ఖన్నా మరణంపై సినీ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ ఆదర్శ్ సంతాపం ప్రకటించారు. 2015లో షారూక్ సినిమా దిల్వాలే ఆయన నటించిన ఆఖరి సినిమా. ఖుర్బానీ, దయావన్ మూవీలలో వినోద్ ఖన్నాతో కలిసి నటించిన ఫిరోజ్‌ఖాన్ తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున( ఏప్రిల్ 27) మరణించారని, ఇపుడు వినోద్ ఖన్నా ఇదే రోజున కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా అక్టోబర్ 6, 1946లోజన్మించిన ఆయన 1968లో సినీ కరియర్ ను ప్రారంభించారు. అమర్ అక్బర్ ఆంటోనీ, ది బర్నింగ్ ట్రైన్ లాంటి చిత్రాలలో నటించారు. 1982లో ఓషో రజనీష్ ప్రభావంతో ఫిలిం ఇండస్ట్రీని వీడాలని నిర్ణయించుకున్నారు. అయితే అయిదేళ్ల తరువాత ఇన్సాఫ్, సత్యమేవ జయతే చిత్రాలో సినీరంగాని తిరిగి చేరువయ్యారు. వినోద్ ఖన్నాకు భార్య , ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. Will miss you Amar. RIP. pic.twitter.com/WC0zt71R4J — Rishi Kapoor (@chintskap) April 27, 2017 Heard about the sad demise of Vinod Khannaji. Kind, considerate, a legend in his own right. Had the honour of producing a series with him. — Smriti Z Irani (@smritiirani) April 27, 2017 -
'లెజెండరీ సింగర్ మృతి.. ఒబామా కంటతడి'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా కంటతడి పెట్టారు. అమెరికా లెజెండరీ ప్రముఖ పాప్ సింగర్, క్రియేటివ్ ఐకాన్ ప్రిన్స్ రోజర్స్ నెల్సన్ అకాల మరణం ఆయన కంటతడిపెట్టేలా చేసింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న ఆయన ప్రిన్స్ మరణంపట్ల సంతాపం వ్యక్తం చేశారు. అమెరికాలోని మిన్నే పోలిస్ లో గల తన స్వగృహంలో ప్రిన్స్ అనూహ్యంగా మృతిచెందాడు. దీంతో ఆ దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 'ప్రిన్స్ మృతిపట్ల మిషెల్లీ నేను.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఫ్యాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. కొంత మంది ఆర్టిస్టులు వారి టాలెంట్ తో కట్టిపడేస్తారు. హృదయాలకు దగ్గరవుతారు. వారిలో ప్రిన్స్ అగ్రజుడు' అని ఒబామా చెప్పారు. ఓ మ్యూజిషియన్ గా ఎంత చేయాలాలో ప్రిన్స్ అంత చేశాడని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. -
హెచ్‌సీయూ విద్యార్థి మృతిపై ఏయూ సంతాపం
విశాఖపట్నం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతి పట్ల ఆంధ్రా యూనివర్సిటీలో సంతాపం తెలిపారు. యూనివర్సిటీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం వైస్ చాన్స్‌లర్ రాజు, రిజిస్ట్రార్ ఉమామహేవశ్వర రావుతో పాటు పలువురు సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు నివాళులర్పించారు. రోహిత్ మృతికి నిరసనగా అన్ని విద్యార్థి సంఘాలు శుక్రవారం యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చాయి. -
కలాం మృతికి ప్రముఖులు సంతాపం