హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతి పట్ల ఆంధ్రా యూనివర్సిటీలో సంతాపం తెలిపారు.
విశాఖపట్నం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతి పట్ల ఆంధ్రా యూనివర్సిటీలో సంతాపం తెలిపారు. యూనివర్సిటీలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం వైస్ చాన్స్లర్ రాజు, రిజిస్ట్రార్ ఉమామహేవశ్వర రావుతో పాటు పలువురు సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు నివాళులర్పించారు. రోహిత్ మృతికి నిరసనగా అన్ని విద్యార్థి సంఘాలు శుక్రవారం యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చాయి.