రాధిక వేమల ( ఫైల్‌ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ లబ్ది కోసమే తనకు ఇరవై లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు తప్పుడు వాగ్ధానం చేశారని రోహిత్ వేముల తల్లి రాధిక ఆరోపించారు. దీనిపై రాధిక సోమవారం కొన్ని విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్ధి వేముల రోహిత్ 2016లో యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య తరువాత కేరళ నుంచి ముస్లిం లీగ్ తరుపున కొంత మంది నాయకులు వచ్చి రోహిత్‌కు మద్దతుగా కేరళలో భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సభకు ముఖ్య అతిధిగా తనను ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు.
వేముల కుటుంబం ఆర్థికంగా వెనుకబడిందిగా గుర్తించిన ముస్లిం లీగ్ నాయకులు విజయవాడలో ఇంటి నిర్మాణం కోసం ఇరవైలక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆ మీటింగ్‌లో ప్రకటించినట్లు ఆమె తెలిపారు. ఇప్పటికి వరకు రెండు చెక్కులు పంపారని అవి రెండు బౌన్స్ అయినట్లు ఆమె వెల్లడించారు. విజయవాడ, గుంటూరు మధ్య ఇంటి నిర్మాణం కోసం స్థలం కూడా చూపించారని అన్నారు. దీనిపై రాధిక తీవ్రంగా మండిపడ్డారు. చెక్కు ఇచ్చే ఉద్దేశం లేకుండా ఇలా తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉండాలని, కేవలం రాజకీయం లబ్ధి కోసమే తనకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్‌పై స్పందించిన ముస్లిం లీగ్ సభ్యులు పొరపాటు వల్ల ఇలా జరిగిందని, ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment