నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
పులివెందుల/ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌నుంచి వైఎస్ జగన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో దిగి అక్కడ నుంచి వి.ఎన్.పల్లె, వేంపల్లె మీదుగా ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు.
ఇడుపులపాయలో మహానేత, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద వైఎస్ జగన్‌రెడ్డి నివాళులర్పించి ప్రార్థనలు చేయనున్నట్లు అవినాష్‌రెడ్డి వెల్లడించారు. అనంతరం వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వైఎస్ జగన్‌ను కలవనున్నారు. వైఎస్ జగన్ ఒక్కరోజు మాత్రమే ఇడుపులపాయలో ఉండి.. మళ్లీ అదే రోజు రాత్రికి హైదరాబాద్ వెళతారని ఆయన వివరించారు.
ఏర్పాట్లు పరిశీలించిన వైఎస్ అవినాష్‌రెడ్డి
వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు రానున్న నేపథ్యంలోవైఎస్ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎస్టేట్ ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్, జనార్థన్‌రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు. పులివెందుల డీఎస్పీ హరినాథబాబు, సీఐ శంకరయ్యలు శాంతిభద్రత దృష్ట్యా పరిసరాలను పరిశీలించారు.