ఆరోగ్యమిత్రల దీక్ష
మహారాణిపేట,న్యూస్‌లైన్ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీహెచ్‌సీల్లోని ఆరోగ్యమిత్రలు, నెట్వర్క్ మిత్రలు, డీటీఎల్, ఎన్‌టీఎల్‌ఎస్ తదితర సిబ్బంది ఏఐటీయూసీ అనుబంధ ఏపీ ఆరోగ్యమిత్ర కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.పద్మ, కార్యదర్శి సీహెచ్ గోవింద్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, వైద్య, విద్య ఖర్చులు పెరిగినందున జీవో 3 ప్రకారం వేతనాలు పెంచి అమలు చేయాలని డిమాండ్ చే శారు.
థర్డ్‌పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, ఆరోగ్యమిత్ర, నెట్వర్క్ మిత్ర, టీడీఎల్‌లు, ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించేటట్లు చేసి వేతనాలను ట్రస్టు ద్వారా నేరుగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మన్మధరావు, ప్రధాన కార్యదర్శి వై.ఎన్.భద్రం, కె.కరుణ, పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.