ఎంపీటీసీ ‘కోళ్ల’ దారుణ హత్య
టెక్కలి: గురువారం.. సమయం మధ్యాహ్నం సుమారు 1:30 గంట లు.. టెక్కలి సోగ్గాడిపేట వీధి ప్రాం తం.. అదే ప్రాంతానికి సమీపంలో పాత జాతీయ రహదారి దగ్గర నిల్చు న్న ఓ వ్యక్తిపై ఆటో, ద్విచక్రవాహనాలపై వచ్చిన కొందరు అగంతకులు కత్తులతో మెరుపు దాడి చేశారు. స్థానికులు తేరుకునేలోగా నడిరోడ్డుపై నెత్తుటి మడుగులో ముఖం గుర్తు పట్టని విధంగా ఆ వ్యక్తి హత్య కు గురయ్యాడు. ఎవరా అని ఆరా తీసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డా రు. మృతుడు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త, మాజీ సర్పంచ్, ఆరవ ప్రాదేశిక ఎంపీటీసీ సభ్యుడు కోళ్ల అప్పన్న కావడమే అం దుకు కారణం. ఈ విషయం పట్టణమంతా దావానంలా వ్యాపించింది. ఒక వైపు పోలీసులు, మరోవైపు హతుని కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ ప్రాంతానికి చేరుకోవడంతో సోగ్గాడిపేట వీధిలో ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది.
హత్య ఎలా జరిగిందంటే?
హతుడు కోళ్ల అప్పన్నపై దాడి జరిగిన సమయంలో అతనితో పాటు ఉంటూ అగంతకుల బారి నుంచి ప్రాణాలతో బయటపడిన అప్పన్న అన్న కుమారుడు కోళ్ల లవకుమార్, మేనల్లుడు పీత రాము తెలియజేసిన వివరాల ప్రకారం.. టెక్కలి మండాపొలం కాలనీలో ఓ ఇంటి స్థలం విషయం లో నెలకొన్న వివాదం పరిష్కారం కోసం టెక్కలికి చెందిన వాకాడ శ్రీధర్ అనే మేస్త్రీ కోళ్ల అప్పన్నను ఆశ్రయించారు. పరిష్కారం కోసం మాట్లాడుదామంటూ స్థానిక సోగ్గాడిపేట సమీపంలోని దుర్గా మల్లేశ్వర ఆలయం వద్దకు రమ్మని అప్పన్నకు ఫోన్ చేశారు. దీంతో అప్పన్నతో పాటు లవకుమార్, పీత రాము, భాస్కర్ బరోడాలు మండాపొలం కాలనీ వద్దకు చేరుకున్నారు. అప్ప న్న, రాము పాత జాతీయ రహదారికి ఆనుకుని దుర్గామల్లేశ్వర ఆల యం వద్ద వేచి ఉండగా లవకుమార్, భాస్కర్ బరోడాలు స్థలం చూసేందుకు వెళ్లారు.
ఆ సమయంలో హఠాత్తుగా ఒక ఆటో, మూడు ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు కత్తులతో అప్పన్నపై మెరుపు దాడి చేశారు. అక్కడే ఉన్న రాము ప్రాణ భయంతో పరుగులు తీసి, సమీపంలోని తనకు సోదరుడు వరుసైన పీత రమణ ఇంటికి వెళ్లిపోయాడు. లవకుమార్, భాస్కర్ బరోడాలు కూడా ఈ సంఘటను దూరం నుంచి చూసి ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికులు చూస్తుండగానే అగంతకులు వాహనాలపై వారిని వెంబడిస్తూ పీత రమణ ఇంటి వద్దకు చేరుకుని రమణకు చెందిన ద్విచక్ర వాహనం, ఇంటి తలుపులపై కత్తులతో దాడులు చేశారు. అనంతరం సోగ్గాడిపేట మీదుగా చేరీవీధి ప్రాంతం వెళ్తూ మధ్యలో ఈత నాగు అనే వ్యక్తిపై దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలియజేశారు. అక్కడి నుంచి చేరీవీధి ప్రాంతం మీదుగా వాహనాలపై పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ముందుగా టెక్కలి సీఐ భవానీప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ ఎమ్.దేవప్రసాద్ వచ్చి వివరాలు సేకరించి అప్పన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ సమయానికి అక్కడే ఉన్న అప్పన్న కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు పోలీసుల వైఫల్యంపై మండిపడ్డారు. శాంతి భద్రతల రక్షణలో పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ హత్య జరిగిందంటూ డీఎస్పీతో మహిళలు వాగ్వాదానికి దిగారు.
పోలీసులకు అంతా తెలుసు!
హంతకుల గురించి ముందుగా మీ పోలీసులకు తెలుసని, అయినా పూర్తి స్థాయిలో భద్రత చర్యలు చేపట్టకపోవడంతో అప్పన్న హత్య జరిగిందంటూ హతుని మేనల్లుడు పీత రాము, అన్న కుమారుడు లవకుమార్ డీఎస్పీ వద్ద టెక్కలి ఎస్ఐ శంకరరావుపై దుమ్మెత్తిపోశారు. చివరికి పోలీసులు వారిని అతికష్టమ్మీద సముదాయించారు. తర్వాత ఎస్పీ ఎ.ఎస్.ఖాన్ వచ్చి సంఘటన స్థలాన్ని.. పరిసరాలను పరిశీలించారు. ప్రాణాలతో బయటపడిన ఈత నాగు అనే ప్రత్యక్ష సాక్షి నుంచి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈ సంఘటన కేవలం వర్గపోరుతో జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎంపీ కె.రామ్మోహన్నాయుడు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలం వద్దకు వెళ్లారు. హంతకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఎస్పీకి సూచించారు.
వర్గపోరే కారణం !
గత ఏడాది నవంబర్ 20న టెక్కలిలో రౌడీషీటర్ కోళ్ల చందరరావు హత్య జరిగింది. ఈ హత్య కేసులో కోళ్ల అప్పన్న, పీత రాము, కోళ్ల లవకుమార్, భాస్కర్ బరోడాలను ముద్దాయిలుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అప్పన్న హత్య కేసుకు సంబంధించి చందరరావు కుమారులు కోళ్ల వసంతరావు, కోళ్ల కామేశ్వరరావుల పాత్ర ఉందంటూ హతుని కుటుంబ సభ్యు లు ఆరోపిస్తున్నారు. చందరరావు హత్య తరువాత ఏడాది కాలంగా ప్రశాంతంగా ఉన్న టెక్కలి పట్టణం మళ్లీ అప్పన్న హత్యతో ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అప్పన్న హత్య కేవలం వర్గపోరులో భాగంగా ప్రత్యర్థులే చేశారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
పోలీసులకు ఫిర్యాదు
టీడీపీ ఎంపీటీసీ కోళ్ల అప్పన్న హత్య సంఘటనపై ఆయన మేనల్లుడు పీత రాము టెక్కలి సీఐ భవానీప్రసాద్కు ఫిర్యాదు చేశాడు. కోళ్ల చంద్రరరావు భార్య పార్వ తి ప్రోత్సాహంతో ఆమె కుమారులు కోళ్ల కామేశ్వరరా వు, కోళ్ల వసంతరావు, కోళ్ల జనార్దన్తో పాటు టెంక హ రి, టెంక సంతోష్, నవీన్, గణేష్పోలు శ్రావణ్, బ్రోకర్ ఆఫీస్ చిన్ని, రాయిపిల్లి కొండలరావు, తన మేనమామను నరికివేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.