Mrinali
-
ప్రేమకథ విన్నారా?
కెరీర్లో హీరోయిన్గా మంచి ఫామ్‌లో ఉన్నారు మృణాళ్ ఠాకూర్. నార్త్ అండ్ సౌత్ అనే తేడాలను పక్కన పెడితే ఈ బ్యూటీ హీరోయిన్గా నటించిన ఐదు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయంటే ఆమె ఏ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారో ఊహించవచ్చు. ఇదే స్పీడ్‌ను కొనసాగించాలనుకుంటూ బాలీవుడ్ కొత్త సినిమాకు సై అన్నారట మృణాళ్. శ్రీదేవి టైటిల్ రోల్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘మామ్’ తీసిన దర్శకుడు రవి ఉడయార్ ఇటీవల ఓ లవ్‌స్టోరీ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నారట. ఆయన ఈ కథను మృణాళ్‌కు వినిపించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రాంరంభం కానుందని బీ టౌక్ టాక్. -
కేంద్రమంత్రికి ఝలక్!
న్యూఢిల్లీ: విదేశాంగ సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకేసింగ్కు షాక్ తగిలింది. సొంత కూతురే ఆయన షాక్ ఇచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక ర్యాంకు ఒక పెన్షన్ అమలు కోసం ఆందోళన చేస్తున్న మాజీ సైనికోద్యోగులను వీకే సింగ్ కుమార్తె మృణాళిని పరామర్శించారు. నిరహార దీక్షలు చేస్తున్న వారికి తన మద్దతు తెలియజేశారు. ఒక మాజీ సైనికాధికారిగా కూతురిగా మాజీ సైనికుల ఆందోళనకు తన మద్దతు తెలుపుతున్నానని మృణాళిని తెలిపారు. సాధ్యమైనంత వేగంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకపక్క ఈ పథకం అమలు చేయడంపై తమకు అభ్యంతరం ఏమీ లేందంటూనే కేంద్రప్ రభుత్వం తాత్సారం చేస్తోంది. మరో పక్క ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ప్రతి పక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దుమ్మత్తిపోస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పథకం అమలుపై కచ్చితమైన ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కుమార్తె ఆందోళన కారులకు మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్ ర్యాంక్, వన్ పెన్షన్ డిమాండ్ పై రిటైర్ ఉద్యోగుల ఆందోళనలు నిరాహారదీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. జంతర్‌మంతర్ వద్ద మాజీ సైనికోద్యోగుల ఆందోళనకు వివిధ పార్టీ నాయకులు ఇప్పటికే తమ మద్ధతు తెలిపారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన పూర్తి మద్దతు ప్రకటించారు.