హద్దులు చెరిపేసి... నిరూపిస్తున్నారు
ఇరవై ఏళ్లుగా 35 దేశాల్లో జరిగిన బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈవెంట్లకు హోస్ట్‌గా, జడ్జ్‌గా, గ్రూమర్‌గా ఉన్నాను. ఒకప్పుడు పదిమంది అమ్మాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వస్తే చాలు అనుకునేవాళ్లం. కానీ, నేడు అమ్మాయిలే కాదు, అమ్మలు అయ్యాక తమని తాము నిరూపించుకోవడానికి వచ్చే మహిళల శాతం 50 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. దానిని నెరవేర్చుకునే క్రమంలో మహిళలకు సరైన ΄్లాట్ఫారమ్ దొరక్కపోవడం,ప్రొఫెషనల్ గా లేకపోవడం, తర్వాత చేద్దాం అనుకోవడం, కుటుంబ బాధ్యతలు అడ్డుగా ఉండటం .. వీటన్నింటి వల్ల టైమ్ దాటిపోతుంటుంది. కానీ, ఏదో ఒక సమయంలో రియలైజ్ అయి, ఆలస్యంగా అయినా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ‘మిసెస్ బ్యూటీ’ పోటీలలో పాల్గొనే గృహిణుల సంఖ్య పెరిగింది. ‘నేను స్టేజీ మీద వాక్ చేయాలి, మంచి గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవాలి, కాన్ఫిడెంట్‌గా సమాధానాలు చెప్పగలగాలి...’ ఇలా ఆలోచిస్తున్నారు. గత తరం వరకు సమాజంలో ఒక ఫ్యాషన్ స్టిగ్మా ఉండేది. దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మహిళా దినోత్సవం ఉద్దేశం కూడా అదే. అందుకు తగినట్టుగానే ఇప్పుడు చాలా వేదికలు ముందుకు వచ్చాయి. మిసెస్ కేటగిరీలోకి వచ్చే మహిళల మైండ్ సెట్, ఔట్ లుక్ పూర్తిగా మారింది. ఇప్పుడు కావాల్సింది టాలెంట్, కాన్ఫిడెన్స్. మహిళ జీవితమే ఒక ఛాలెంజ్. అందుకే, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మహిళలు సవాళ్లను చాలా సులవుగా అధిగమిస్తున్నారు. ఒక కాలేజీ అమ్మాయి మిస్ కాలేజీ తర్వాత మిస్ ఇండియా ఆ తర్వాత మిస్ యూనివర్స్ గురించి ఆలోచిస్తున్నట్టే, గృహిణులుగా ఉన్నవారు కూడా అలాగే క్లారిటీగా ఆలోచిస్తున్నారు. గ్లామర్ రంగంలో గతంలో అమ్మాయిల గురించి ఉన్న నెగిటివిటీ స్థానంలో పాజిటివిటి చేరింది. ఇది చాలా మంచి మార్పు. జూన్‌లో మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్‌ని హోస్ట్ చేస్తున్నాను. దీనికి గృహిణులుగా ఫ్యాషన్ షోలలో పాల్గొనేవారికి శిక్షణ ఇస్తున్నాను.– వాలెంటీనా మిశ్రా, క్రియేటివ్ డైరెక్టర్, మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్ హోస్ట్