‘మైక్రోసా్‌ఫ్ట్’ పోటీల్లో వీఐటీ ప్రతిభ
వేలూరు: మైక్రోసాఫ్ట్ సంస్థ జరిపిన ఎమ్ఎస్ ఆఫీస్ నిపుణుల పోటీ ల్లో అంతర్జాతీయ స్థాయిలో వేలూరు వీఐటీ యూనివర్సిటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఐదుగురు విద్యార్థులు రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థులను వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్ అభినందించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ సాఫ్ట్‌వేర్‌లో విద్యార్థులను ఎంపిక చేసేందుకు కంప్యూటన్ అనే పేరుతో ప్రతి సంవత్సరం పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో మైక్రోసాఫ్ట్ నిపుణులు అనే అవార్డును ప్రకటిస్తారు. ఈ ఏడాది ప్రపంచ స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు గత ఏప్రిల్‌లో పోటీలు నిర్వహించారు.
వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని మైక్రోసాఫ్ట్ కేంద్రం ఆధ్వర్యంలో జరిపిన ఈ పోటీల్లో బీటెక్, ఎంటెక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివే విద్యార్థులు 72 మంది కలుసుకున్నారు. ఈ పోటీలకు ఎనిమిది మంది వీఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని న్యూయడోలో మే 30వ తేదీన అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వీఐటీలోని మైక్రోసాఫ్ట్ ఇనోవేషన్ సెంటర్ ప్రొఫెసర్ దినేష్, వీసుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
వీరితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి మైక్రోసాఫ్ట్, ఇడియేషన్ ఫీస్ట్, ఆఫ్తాన్, హాక్‌తాన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్లపై పరిశోధనలు చేశారు. ఈ పోటీల్లో వీఐటీకి చెందిన అరుణ్‌కుమార్ ఎమ్ఎస్ వరల్డ్‌లో రెండో స్థానం, కరుణ్ మాత్యూ ఎమ్ఎస్ పవర్ పాయింట్లో రెండో స్థానం లభించింది. సిద్దార్థాఫ్పా, శివం, ఆదిత్య, జ్ఞాన హిదితాలు సాధన చేశారు. సాధన చేసిన విద్యార్థులను వీఐటీ చాన్సలర్ విశ్వనాథన్, వైస్ చాన్సలర్ రాజు, ఉపాధ్యక్షులు జీవి సెల్వంలు అభినందించారు.