ఎమ్మెస్సార్ రాజీనామా
కరీంనగర్ : అనూహ్యంగా.. ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవాళ్లు రాజీనామా చేయాలని ఈనెల 3న గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. ఈ క్రవుంలో ఎమ్మెస్సార్ మంగళవారం తన రాజీనావూ పత్రాన్ని గవర్నర్‌కు పంపించారు. 1990లో తొలిసారి ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులై న ఆయన 1994 వరకు పదవిలో ఉన్నారు. 2007 నవంబర్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన నుంచి ఇప్పటివరకు ఎమ్మెస్సార్ ఆ పదవిలో కొనసాగుతున్నారు.
ఆరు సంవత్సరాల పాటు పదవిలో ఉండేందుకు ప్రభుత్వపరంగా అవసరమైన సవరణలు కూడా ఆయన చేయించుకున్నారు. ఆర్టీసీపై తనకు మినహా ఇతరులకు ఆధిపత్యం ఉండరాదని అప్పటివరకు ఉన్న జోనల్ చైర్మన్ల వ్యవస్థను కూడా రద్దు చేయించారు. ఈ సంవత్సరంతో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే.. గవర్నర్ ఎమ్మెస్సార్ రాజీనామాను ప్రత్యేకంగా కోరలేదని, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో విమర్శలు రావద్దనే రాజీనావూ చేశారని ఆయన కుటుంబసభ్యులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఎమ్మెస్సార్‌కు పదవులు కొత్తేం కాదని, ఇంకా పదవీకాలం ఉన్నా రాజీనామా చేశారన్నారు.
అదే బాటలో అడ్లూరి
ఆర్టీసీ తరువాత రాష్ట్ర స్థారుులో పదవిలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కువూర్ కూడా రాజీనామా బాట పట్టనున్నారు. ఆర్టీసీ చైర్మన్ పదవికి ఎమ్మెస్సార్ రాజీనామా చేయుడంతో ఆయనను అనివార్యంగా లక్ష్మణ్ అనుసరించాల్సి వస్తోంది. తన కార్యాలయూనికి ఆదేశాలు వచ్చిన మరుక్షణమే రాజీనావూ చేస్తానని లక్ష్మణ్‌కువూర్ ‘న్యూస్‌లైన్’కు స్పష్టం చేశారు. ఆయన కొద్ది నెలల క్రితమే ఈ పదవిలో నియమితులయ్యారు.
మరికొందరు సైతం..
రాష్ట్రపతి పాలన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ నిర్ణయుంతో జిల్లాలో నామినేటెడ్ పదవులు పొందిన నాయకులంతా తవు పదవులు త్యాగం చేయుక తప్పని పరిస్థితి ఎదురైంది. జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా పనకంటి చంద్రశేఖర్, ఆర్టీఏ సభ్యుడిగా ఆమ ఆనంద్ కొనసాగుతున్నారు. కరీంనగర్, జమ్మికుంట, హుస్నాబాద్, వుుస్తాబాద్, వేవుులవాడ, వుల్యాల, గంగాధర, జగిత్యాల, చొప్పదండి, కోరుట్ల, మెట్పల్లి, కథలాపూర్, ధర్మపురి, ధర్మారం, గొల్లపల్లి వూర్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు. గవర్నర్ నిర్ణయం పూర్తిగా అవులరుుతే వీరందరూ రాజీనామా చేయూల్సి ఉంటుంది.