మాకు ప్రత్యేక గదులు కేటాయించాలి
అశోక్‌బాబును నిలదీసిన టీఎన్జీవోలు
హైదరాబాద్ : ఏపీఎన్జీవోస్ హోంలో టీఎన్జీవోస్ అసోసియేషన్‌కు ప్రత్యేకంగా గదులు కేటాయించాలంటూ అసోసియేషన్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. గదుల కేటాయింపుపై ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుకు వినతి పత్రం ఇవ్వడానికి శనివారం గన్‌ఫౌండ్రిలోని ఏపీఎన్జీవోస్ హోంకు టీఎన్జీవోలు వెళ్లారు. వినతి పత్రాన్ని తీసుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఏపిఎన్జీఓస్ హోం నుంచి తమ అసోసియేషన్ కార్యకలాపాలను కొనసాగిస్తామని, ఏపిఎన్జీఓస్ అసోసియేషన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా వారికి అండగా ఉంటామని తెలిపారు.