21న ఎంటెక్ స్పాన్సర్డ్ సీట్లకు కౌన్సెలింగ్
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల, ఓటీఆర్‌ఐలో ఎంటెక్ ,ఎంఫార్మసీ స్పాన్సర్డ్ సీట్లకు సంబంధించి ఈనెల 21న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఎంటెక్‌లో రిఫ్రిజిరేషన్స్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎనర్జీ సిస్టమ్స్, ప్రొడక్షన్ డిజైన్, అడ్వాన్స్డ్ ఇంటర్నల్ కంబ్యూజన్ ఇంజిన్స్, క్యాడ్, క్వాలిటీ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చురింగ్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్, వీఎస్ఎల్ఐ డిజైన్స్, ఎంబీడెడ్ సిస్టమ్స్, పవర్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్, కంట్రోల్ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ (జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల), ఫార్మాసూటికల్ అనాలసిస్ (ఓటీఆర్‌ఐ)లో సీట్లు భర్తీ చేస్తారు. జేఎన్టీయూ అనంతపురం పాలకభవనంలో కౌన్సెలింగ్ జరగనుంది.