ప్రారంభించిన 24 గంటల్లోనే..
సాక్షి, విజయవాడ : ముచ్చమర్రి ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటి విడుదల నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చుమర్రి నుంచి మోటార్లు ఆన్‌చేసి 24 గంటలు గడవక ముందే శనివారం అధికారులు నీటిని నిలిపివేశారు. ముచ్చుమర్రి నుంచి 4 పంపుల ద్వారా హంద్రీనీవాకు నీరు ఇచ్చి రాయలసీమ రైతులను ఆదుకుంటామని శుక్రవారం నీరు విడుదల సందర్భంగా చంద్రబాబు తెలిపారు.
అయితే 24 గంటల్లోనే నీటిని నిలిపివేశారు. కాగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్లో నీళ్లు అందకపోవడంతోనే నీటిని నిలిపినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల నుంచి రెండు పంపుల ద్వారా కేసీ కెనాల్‌కు నీటి విడుదల కొనసాగుతోంది.