కన్న తండ్రిని కడతేర్చాడు
మైదుకూరు టౌన్: కుటుంబ కలహహాల కారణంగా కన్నతండ్రినే ఓ కొడుకు కడతేర్చిన ఘటన మంగళవారం మైదుకూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల క థనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మైదుకూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన ముద్ద శెట్టి వెంకటసుబ్బయ్య అలియాస్ లక్ష్మిభవన్ హోటల్ వెంకటసుబ్బయ్య(58) గత కొది ్దసంవత్సరాలుగా కడపలో నివాసం ఉంటూ లక్ష్మిభవన్ హోటల్ నిర్వహిస్తున్నాడు.
అలాగే మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామం వద్ద పొలాలు కొనుగోలు చేసి సాగుచేసుకుంటున్నాడు. వెంకటసుబ్బయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు కొద్ది సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కుమారుడు ముద్దం శివ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. గత కొద్ది నెలలుగా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి విషయమై మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం శివ, అతని బావమరిది మైలారు జగనాథంలు కలిసి వెంకటసుబ్బయ్యను హత్య చేశారు.
హత్య చేసిన తీరు....
తిప్పిరెడ్డిపలె ్ల మెయిన్ రోడ్డు సమీపంలో పొలంలోని ఇంటి వద్ద ఆరు బయట మంగళవారం సాయంత్రం వెంకటసుబ్బయ్య కూర్చొని ఉండగా అతని కుమారుడు శివ, బావమరిది జగన్నాథం పథకం ప్రకారం పొలం వద్దకు వచ్చి వెంకటసుబ్బయ్యతో గొడవపడ్డారు. ఈ సమయంలోనే వేటకొడవళ్లతో మెడ భాగంలో నరకగా అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయాడు. అనంతరం శివ, జగ న్నాథంలు ద్విచక్రవాహనంపై మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి హత్య చేసేందుకు ఉపయోగించిన వేటకొడవ ళ్లతో లొంగిపోయారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ..
వెంకటసుబ్బయ్య హత్య సమాచారం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ ఎస్.వి శ్రీధర్‌రావు, సీఐ వెంకటే శ్వరు ్ల హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. కొన్ని ఆధారాలను సేకరించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చే శారు.