తాలిబన్ నాయకుడు ముల్లా ఒమర్ హతం?
అఫ్ఘాన్ తాలిబన్ నాయకుడు ముల్లా మహ్మద్ ఒమర్ హతమయ్యాడు. ఈ విషయాన్ని అఫ్ఘానిస్థాన్ అధికారవర్గాలు తెలిపాయి. అయితే, దీని గురించి తాలిబన్ వర్గాలు మాత్రం ఏమీ వ్యాఖ్యానించలేదు. అయితే.. ఒమర్ రెండు మూడేళ్ల క్రితమే చనిపోయాడని అఫ్ఘాన్ ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.
దీని గురించిన తదుపరి వివరాలేవీ మాత్రం వెల్లడించలేదు. ఈ విషయమై తాలిబన్ వర్గాలు త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తాయని తాలిబన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ముల్లా ఒమర్ చనిపోయినట్లు గతంలోనే పలు రకాల కథనాలు వచ్చాయి. అయితే ఎప్పుడూ తాలిబన్లు వాటిని ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా ఒమర్ మరణించినట్లే చెబుతున్నాయి.