ముల్లైపెరియార్ 152 అడుగులు
సాక్షి, చెన్నై : కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లై పెరియార్ డ్యాంపై సర్వ హక్కుల్ని తమిళనాడు కల్గి ఉన్న విష యం తెలిసిందే. ఈ హక్కుల్ని కాలరాయడం లక్ష్యంగా కేరళ తరచూ ఏదో ఒక కుట్ర చేస్తూ వస్తున్నది. ఈ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం వాస్తవానికి 152 అడుగులు. 36 ఏళ్ల క్రితం ఈ డ్యాం నీటి మట్టం 142 అడుగులకు తదుపరి, కేరళ కుట్ర పుణ్యమా నీటి మట్టం 136 అడుగులకు తగ్గింది. ఏళ్ల తరబడి రాష్ట్రంలో ని పాలకులు నీటి మట్టం పెంపు లక్ష్యం గా న్యాయ స్థానంలో పోరాడుతూనే వ చ్చారు. ఎట్టకేలకు 2014లో సుప్రీం కో ర్టు తమిళనాడుకు అనుకూలంగా తీర్పు ను వెలువరించింది. ఆ డ్యాం నీటి మ ట్టం 142 అడుగులకు పెంచుకునేందుకు ఆదేశాలు ఇచ్చింది. అందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనూ కేరళ కుట్రలకు హద్దే లేదు.
152 అడుగులు : సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో, కేరళ కుట్రల్ని భగ్నం చేస్తూ నెలల తరబడి ఈ డ్యాం నీటి మట్టం పెంపు ప్రక్రియ సాగుతూ వచ్చింది. ఎట్టకేలకు 2014 నవంబర్ 14న డ్యాం నీటి మట్టం 142 అడుగులకు చేరడంతో ఆ డ్యాం నీటి ఆధారిత అన్నదాతల్లో ఆనందం తాండవం చేసింది. తమిళుల కల సాకారం కావడంతో, ఎక్కడ 152 అడుగులకు నీటి మట్టం పెంచాలన్న డిమాండ్ తెర మీదకు తెస్తారోనన్న బెంగతో మళ్లీ కుట్రల బాటలో కేరళ ప్రభుత్వం పయనించింది. అదే సమయంలో నీటి మట్టం 152 అడుగులకు చేరాల్సిందేనని ఆ డ్యాం నీటి ఆధారిత తేని, శివగంగై, రామనాథపురం, విరుదునగర్, మదురై జిల్లాల్లోని అన్నదాతలు నినాదాన్ని అందుకున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయింది. డ్యాం నీటి మట్టం పూర్తి స్థాయిలోకి చేర్చే దిశగా 152 అడుగుల నినాదంతో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం సైతం తీసుకొచ్చారు. అలాగే, కోర్టు ద్వారా ఓ వైపు నీటి మట్టం పెంపు ప్రయత్నాలు చేపడుతూనే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఇందుకు కేంద్ర నీటి పారుదల శాఖ వర్గాలు చర్యలు చేపట్టాయి. ఆ మేరకు కేంద్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కూడిన ఐదుగురి బృందం మంగళవారం ముల్లై పెరియార్ డ్యాం పరిసరాల్లో పరిశీలన చేపట్టింది.
ప్రధాన డ్యాం గేట్లను, బేబి డ్యాం, ప్రధాన డ్యాంలోకి నీళ్లు వచ్చే ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ప్రధానంగా డ్యాం సామర్థ్యం మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన ఈ బృందం కేంద్ర నీటి పారుదల శాఖ కు నివేదికను సమర్పించనుంది. తదుపరి చర్యల మేరకు నీటి మట్టం పెంపునకు కసరత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, నీటి మట్టం పెంపు లక్ష్యంగా వచ్చిన ప్రతిపాదనలో భాగంగా తమ పరిశీలన సాగిందని, ఇది తొలి విడత పర్యటన అని, మరో మారు ఇక్కడ పరిశీలనకు అవకాశాలు ఉన్నట్టు ఆ బృందం వర్గాలు పేర్కొన్నాయి.