Munich attack
-
మ్యూనిచ్‌లో దుండగుడి బీభత్సం..
మ్యూనిచ్ : జర్మనీలోని ప్రఖ్యాత నగరం మ్యూనిచ్‌లో శనివారం ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. కత్తితో పలువురిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. సెంట్రల్ మ్యూనిచ్‌లోని రోసెన్హైమర్ ప్లాజా వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం నలుగురికి తీవ్రగాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దుండగుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని చెప్పిన పోలీసులు.. ఇండ్ల నుంచి బయటికి రావొద్దంటూ రోసెన్హైమర్ ప్రాంత వాసులను హెచ్చరించారు. అయితే ఇది ఉగ్రవాద చర్యా, మరొకటా అన్నది ఇంకా తెలియాల్సిఉంది. యూరప్‌లోని ఐసిస్ సానుభూతిపరులు ఇటీవల వరుస దాడులకు పాల్పడిన నేపథ్యంలో తాజా దాడిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
మ్యూనిక్ దాడిని ఖండించిన మోదీ
న్యూఢిల్లీ: జర్మనీలోని మ్యూనిక్ నగరంపై ఉగ్రవాదుల దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. మ్యునిక్ లో జరిగిన దాడి భీతిని కొల్పిందని, దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. శుక్రవారం మునిక్ లోని ఒలింపిక్ స్టేడియం సమీపంలో గల ఒలింపియా షాపింగ్ సెంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణకాండలో పదిమంది చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్యను ఖచ్చితంగా నిర్ధారించలేదు. మరో 22 మంది గాయపడ్డారు. -
నేను సైతం అంటున్న ఫేస్బుక్
లండన్: ప్రత్యేకమైన విపత్తు సమయాల్లో యాక్టివేట్ చేసే ఫేస్ బుక్ 'భద్రతా తనిఖీ ఫీచర్' ను మరోసారి యాక్టివేట్ చేసింది. జర్మనీలోని మ్యూనిక్ నగరంపై ఉగ్రదాడిపై స్పందించిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ అక్కడి ప్రజల సౌకర్యార్థం తనవంతు ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ ప్రత్యేక ఫీచర్‌ను శుక్రవారం యాక్టివేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా తమ బంధువులు, స్నేహితులకు క్షేమ సమాచారాలను అందించవచ్చు. తాము సేఫ్‌గా ఉంటే ఆ విషయాన్ని ఫేస్బుక్లో ఈ ఫీచర్ ద్వారా వెల్లడించవచ్చు. ఈ సేఫ్టీ చెక్ ఫీచర్‌లోని 'సేఫ్' అనే బటన్ మీద క్లిక్ చేయగానే.. ఒక ప్రత్యేకమైన టూల్ వారు క్షేమంగా ఉన్నారన్న స్టేటస్‌ను వెంటనే అప్డేట్ చేస్తుంది. అలాగే మిగతా యూజర్లు కూడా తమ స్నేహితులు క్షేమ సమాచారాలను కూడా తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. జర్మన్ మ్యూనిక్ లోని ఒలింపిక్ స్టేడియం సమీపంలో గల ఒలింపియా షాపింగ్ సెంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన ఘటనలో 18 ఏళ్ల ఇరానియన్- జర్మన్ అటాకర్ సహా పది మంది చనిపోయినట్లు నిర్ధారించాయి. చాలా స్వల్పకాలంలోనే ఫేస్ బుక్ ఈ సేఫ్టీ టూల్ ను యాక్టివేట్ చేయడం ఇది నాలగవసారని మెట్రో యూకేని వేదించింది. కాగా ఫేస్బుక్ యాజమాన్యం ఈ 'సేఫ్టీ చెక్ టూల్'ని 2014లో ప్రవేశపెట్టింది. చైన్నై వరదలు, పారిస్, అమెరికా దాడుల సందర్భంగా ఈ ఫీచర్ యూజర్లకు బాగా ఉపయోగపడిన సంగతి తెలిసిందే.