నేను సైతం అంటున్న ఫేస్బుక్ | Munich attack: Facebook activates safety check tool | Sakshi
Sakshi News home page

నేను సైతం అంటున్న ఫేస్బుక్

Published Sat, Jul 23 2016 8:56 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

Munich attack: Facebook activates safety check tool

లండన్: ప్రత్యేకమైన విపత్తు సమయాల్లో  యాక్టివేట్ చేసే ఫేస్ బుక్ 'భద్రతా తనిఖీ ఫీచర్' ను  మరోసారి యాక్టివేట్ చేసింది.  జర్మనీలోని మ్యూనిక్ నగరంపై ఉగ్రదాడిపై  స్పందించిన  సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్  అక్కడి ప్రజల సౌకర్యార్థం  తనవంతు ప్రయత్నం  చేస్తోంది. దీనిలో భాగంగా ఈ ప్రత్యేక ఫీచర్‌ను  శుక్రవారం యాక్టివేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా తమ బంధువులు, స్నేహితులకు క్షేమ సమాచారాలను అందించవచ్చు. తాము సేఫ్‌గా ఉంటే ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో ఈ ఫీచర్ ద్వారా వెల్లడించవచ్చు. ఈ సేఫ్టీ చెక్ ఫీచర్‌‌లోని 'సేఫ్' అనే బటన్ మీద క్లిక్ చేయగానే.. ఒక ప్రత్యేకమైన టూల్ వారు క్షేమంగా ఉన్నారన్న స్టేటస్‌ను వెంటనే అప్‌డేట్ చేస్తుంది. అలాగే మిగతా యూజర్లు కూడా  తమ స్నేహితులు క్షేమ సమాచారాలను కూడా  తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది.

జర్మన్  మ్యూనిక్ లోని ఒలింపిక్ స్టేడియం సమీపంలో గల ఒలింపియా షాపింగ్ సెంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడిన ఘటనలో 18 ఏళ్ల ఇరానియన్- జర్మన్ అటాకర్ సహా పది మంది చనిపోయినట్లు నిర్ధారించాయి.  చాలా స్వల్పకాలంలోనే ఫేస్ బుక్ ఈ సేఫ్టీ టూల్ ను యాక్టివేట్ చేయడం ఇది నాలగవసారని మెట్రో యూకేని వేదించింది.


కాగా ఫేస్‌బుక్ యాజమాన్యం ఈ 'సేఫ్టీ చెక్ టూల్'ని 2014లో ప్రవేశపెట్టింది.   చైన్నై వరదలు, పారిస్‌, అమెరికా దాడుల సందర్భంగా   ఈ ఫీచర్ యూజర్లకు బాగా ఉపయోగపడిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement