
దాడి చోటుచేసుకున్న ప్రదేశంలో పోలీసు వాహనాలు, (హెలికాప్టర్‌తోనూ వేట)
మ్యూనిచ్ : జర్మనీలోని ప్రఖ్యాత నగరం మ్యూనిచ్‌లో శనివారం ఓ దుండగుడు బీభత్సం సృష్టించాడు. కత్తితో పలువురిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. సెంట్రల్ మ్యూనిచ్‌లోని రోసెన్‌హైమర్ ప్లాజా వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం నలుగురికి తీవ్రగాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
దుండగుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉండొచ్చని చెప్పిన పోలీసులు.. ఇండ్ల నుంచి బయటికి రావొద్దంటూ రోసెన్‌హైమర్ ప్రాంత వాసులను హెచ్చరించారు. అయితే ఇది ఉగ్రవాద చర్యా, మరొకటా అన్నది ఇంకా తెలియాల్సిఉంది. యూరప్‌లోని ఐసిస్ సానుభూతిపరులు ఇటీవల వరుస దాడులకు పాల్పడిన నేపథ్యంలో తాజా దాడిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment