Munsipaliti
-
అమృత్ 2.0.. ఇంకెప్పుడో?
ఆదిలాబాద్: స్థానిక మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద రూ. 95.50 కోట్ల నిధులు విడుదల చేసింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పనులను చేపట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కూడా ఇచ్చింది. ఈ పనుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నిధులు సైతం మంజూరయ్యాయి. అయినా పనుల ప్రారంభంపై అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.14 నెలల క్రితం నిధుల మంజూరు..రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రజలకు అవసరమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద 2023 మే 20న నిధులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.95.50 కోట్లు కేటాయిస్తూ జీవో నంబర్ 312ను జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బల్దియా కూడా తమ వాటా చెల్లించి తాగునీటి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు జారీ చేసింది.అప్పుడే పనులు ప్రారంభించాల్సి ఉండగా టెండర్ల దాఖలకు కాంట్రాక్టర్లు ఆ సమయంలో ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. గతేడాది డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల పాటు ఈ పనులను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి చేపట్టేందుకు అనుమతినిచ్చింది. పనులు ప్రారంభమవుతాయని ప్రజలు సంబరపడ్డారు. అయితే ఇప్పటికి ఎలాంటి ప్రగతి లేకపోవడం గమనార్హం.టెండర్ల ప్రక్రియ పూర్తయినా..పట్టణంలోని ప్రతీ వ్యక్తికి రోజుకు 135 లీటర్ల నీటిని అందించాలనే ఉద్దేశంతో పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తాగునీటి సమస్య ఉన్న పట్టణంలో కొత్తగా విలీనమైన కేఆర్కే కాలనీ, భగత్‌సింగ్‌నగర్, న్యూ హౌసింగ్‌బోర్డు, రాంపూర్ వంటి కాలనీల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణాలతో పాటు తాగునీటి సరఫరాకు అవసరమైన పైపులైన్లు, నల్లా కనెక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ పరిధిలోని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఏయే కాలనీల్లో ఎలాంటి పనులు చేపట్టాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రస్థాయిలోనే టెండర్ల ప్రక్రియ ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది వేసవిలోనూ ఆయా ఆయా కాలనీల ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికై నా త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.త్వరలోనే ప్రారంభిస్తాం..అమృత్ 2.0 పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క చేతుల మీదుగా పనులకు భూమి పూజ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మరో పది, పదిహేను రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, పబ్లిక్ హెల్త్, ఈఈ -
ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం!
నాగర్‌కర్నూల్: శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ పోరుపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం యంత్రాగాన్ని సమాయత్తపరుస్తోంది. ఇందులో భాగంగా పోలింగ్ సిబ్బంది వివరాలను సమర్పించాల్సిందిగా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వివరాలు ఈ నెల 30లోగా టీ–పోల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి వివరాలను అధికారులు యాప్‌లో పొందుపరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2019 ఎన్నికల స్థానాలకు రిజర్వేషన్లు పదేళ్ల పాటు వర్తిస్తాయని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో ఎస్టీలకు 318 గ్రామపంచాయతీలు, ఎస్సీలకు 295, బీసీలకు 355, జనరల్ అభ్యర్థులకు 716 గ్రామపంచాయతీలను రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఇందులో సగం మహిళలకు కేటాయించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. షెడ్యూల్ ఏరియాలోని పంచాయతీల్లో వందశాతం ఎస్టీలకు రిజర్వేషన్ వర్తిస్తోంది. ఒక వేళ చట్టంలో మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రస్తుత చట్టాన్ని మార్చాలి. ఇది జరగాలంటే మరో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆపై ఆమోదం పొందాలి. ఇంత ప్రక్రియ జరగాలంటే మరింత సమయం పడుతుంది. మరోవైపు పాలకవర్గాల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియను కమిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత సమయం లేదు. ఆయా పరిణామాల నేపథ్యంలో స్థానిక సంగ్రామం సకాలంలో జరగకపోవచ్చు అనే అభిప్రాయం అధికారులు, రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి రావడం అనివార్యమవుతుంది. బ్యాలెట్ పోరు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే దాన్ని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించాల్సి ఉంటుంది. కొత్తగా అభ్యంతరాలు, స్వీకరణ, పరిశీలన జరిపి తుది జాబితా వెల్లడించడం తప్పనిసరి. ఈ ప్రక్రియకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్నికల విభాగం అధికారులు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల జాబితాల్లో దొర్లిన తప్పుల సవరణకు సంబంధించి ఓటర్లకు అవకాశం ఇవ్వాలి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పంచాయతీ పోరుకు తుది ఓటరు జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసే వీలుంది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పెట్టెలు సేకరించాలి. బ్యాలెట్ పత్రాలను ముద్రించాలి. ఇదంతా జరగాలంటే ఇప్పుడున్న సమయం కూడా చాలదన్న అభిప్రాయం ఎన్నికల అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ కోణంలో చూసి ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అనే వాదన వినిపిస్తోంది. ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు.. -
త్వరలో పురపాలికల్లో ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: త్వరలో మున్సిపాలిటీల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. వచ్చే మూడేళ్లలో మున్సిపాలిటీల రూపురేఖలు మార్చే లా అధికారులు, నాయకులు పనిచేయాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. మున్సిపల్ అభివృద్ధికి తాగునీరు, పరిశుభ్రత, పార్కులు, తడి, పొడి చెత్తల సేకరణ, పన్ను వసూళ్లు ఇలా మొత్తం 42 అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మున్సిపాటీల అభివృద్ధి ప్రణాళికపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలసి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, గూడెం మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఒడితల సతీష్ కుమార్, పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరీదుద్దీన్, భూపాల్‌రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, హన్మంతరావు, ధర్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు పాల్గొన్నారు. 400 పాత బస్సులతో షీ టాయిలెట్స్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలో నెలకు రూ. 12 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్ చొప్పున ఏర్పాటు చేయాలని, అందులో 50 శాతం షీ టాయిలెట్లు ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 400 పాత బస్సులు తీసుకొని షీ టాయిలెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ఉదయం 5:30 గంటల నుంచే వార్డుల్లో పర్యటించాలని, అలా అయితేనే ప్రజల సమస్యలు తెలుస్తాయన్నారు. చెత్త సేకరణ మొక్కుబడిగా కాకుండా నూతన ఒరవడితో సేకరించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి పట్టణమే కేంద్రమని, పట్టణంలో వచ్చే మార్పు నియోజకవర్గం మొత్తం ప్రభావితం చూపుతుందన్నారు. పక్కాగా నీటి సౌకర్యం... ‘వాటర్ ఆడిట్లో భాగంగా మున్సిపాలిటీల్లో ఎంత నీరు ప్రజలకు సరఫరా చేస్తున్నాం, మన కు ఆ నీటికి సరిపడా బిల్లులు చెల్లిస్తున్నారా లేదా అని అంచనాలు తయారు చేయాలి. సింగపూర్ లాంటి దేశాల్లో 100 లీటర్ల నీటికి 90 లీటర్ల బిల్లు లు వస్తాయి. పది శాతం నీరు ట్రాన్సిట్ లాస్ అవుతుంది. మన దగ్గర 100 లీటర్ల నీటికి 60 లీటర్లకు కూడా బిల్లులు రావడం లేదు. ఈ పరి స్థితి మారాలి. ప్రజలకు మంచి నీటి సౌకర్యం పక్కాగా, ప్రణాళికాబద్ధంగా అందిస్తే బిల్లులు చెల్లించడానికి వెనుకాడరు. తెల్ల కార్డుదారులకు రూపాయికే, మిగతా వారికి రూ. 100కి నల్లా కనెక్షన్ ఇవ్వాలి’అని కేటీఆర్ ఆదేశించారు. -
సగం ఖాళీ
మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత పట్టణాలుగా మారినా ఫలితం లేదు ఉన్నవారితోనే నెట్టుకొస్తున్న పురపాలికలు సేవలు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు హన్మకొండ : సిబ్బంది కొరతతో మున్సిపాలిటీల్లో పాలన మందగించింది. పారిశుద్ధ్యం, టౌన్‌ప్లానింగ్ వంటి కీలక విభాగాల్లో ఇన్చార్జుల పాలన కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను మినహాయిస్తే జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఆ పురపాలికలు సగం సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, నర్సంపేటలు మేజర్ గ్రామపంచాయతీల నుంచి నగర పంచాయతీలుగా 2011లో అప్‌గ్రేడ్ అయినా ఉద్యోగుల సంఖ్య పెరగలేదు. దీంతో పట్టణ ప్రజలకు మెరుగైన సేవ లు అందడం లేదు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉండగా 31 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ, కేవలం 9 మందే విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది మంది ఉద్యోగులు ఇక్కడ పోస్టింగ్ రాగానే ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోతున్నారు. గతేడాది భూపాలపల్లిలో పోస్టింగ్ తీసుకున్న మేనేజర్ కొద్ది రోజుల్లోనే మెదక్ జిల్లా దుబ్బాకకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో పరిపాలనకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అకౌంట్స్ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు ఉండాలనే నిబంధనలుండగా ఒక్కరూ లేకుండా పోయారు. ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరకాల ఏఈ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లి, పరకాలకు ఒక్కరే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో తాగునీటి నిర్వహణ గాడిన పడటం లేదు. పరకాల నగర పంచాయతీలో 30 పోస్టులు మం జూరు కాగా కేవలం ఆరుగురే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపైనే పనిభారం పడుతోంది. టౌన్ ప్లానింగ్‌లో ఉద్యోగుల పోస్టులు భర్తీ కాకపోవడంతో భవన నిర్మాణ అనుమతుల విషయంలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భవనాల నిర్మాణ అనుమతి కోరుతూ వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పర్యవేక్షణ అధికారులు లేక పో వడంతో పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణా లు వెలుస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంద రు ప్రజాప్రతినిధులు బినామీలను నియమించుకుని నోటీసులు జారీ చేస్తామని బెదిరిస్తూ అక్రమ భవన నిర్మాణ యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. నర్సంపేట నగర పంచాయుతీలో 63 వుంది ఉద్యోగులకుగాను కేవలం 27వుంది ఉన్నారు. వివిధపను ల కోసం కార్యాలయం వచ్చే వారు చిన్న పనికి కూ డా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. మున్సిపల్ సిబ్బంది మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోయా యి. నిత్యం ఒకవర్గంపై మరోవర్గం ఫిర్యాదులు చే సుకుంటూ ప్రజాసేవలను పక్కకు పెడుతున్నారు. అక్కడా అంతే.. 1953లోనే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన జనగామ మున్సిపాలిటీలోనూ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం గేడ్-్ర2 మున్సిపాలిటీగా ఉన్న జనగామలో మొత్తం 132 పోస్టులకు గాను 70 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలన విభాగంలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పట్టణ అభివృద్ధికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఇంజనీరింగ్ విభాగంలో 22 పోస్టులకు గాను 14 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో సరైన ప్రణాళికా లేకుండా నిర్మించిన డ్రెరుునేజీలతో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. వర్షకాలంలో మురుగునీరు, వరద నీటితో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. పబ్లిక్ హెల్త్ వర్కర్లు 57 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది ఉన్నారు. 2011లో మహబూబాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి ఏకంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబాబాద్ మున్సిపాలిటీ జనాభా 52 వేలు. కానీ, అనధికారికంగా సుమారు 70 వేల జనాభా ఉంటుంది. జనాభాకు తగ్గ సిబ్బంది లేరు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ పోస్టు దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉంది. దీంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఐదు పోస్టులకు గాను ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు కష్టంగా మారాయి. మరికొందరు ఎటువంటి అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పురపాలక సంఘం పాలకమండలి సమావేశంలో సైతం అక్రమ నిర్మాణాలపై చర్చ జరిగింది. తాగునీటి సమస్య దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. పర్మినెంట్ రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు లేకపోవడంతో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. పేరుకే గ్రేటర్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 160 పోస్టులకు గాను 124 మంది సిబ్బంది ఉన్నారు. 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల 42 విలీన గ్రామాలు కార్పొరేషన్లో విలీనమయ్యాయి. దీంతో దాదాపు 3 లక్షల జనాభా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా పోస్టుల సంఖ్య పెరగాల్సి ఉంది. పరిపాలన విభాగంలో సి బ్బంది కొరత లేకపోవడంతో పాలన వ్యవహారాలకు చాలా వరకు సాఫీగానే సాగుతున్నాయి. కానీ టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, ప్రజారోగ్య విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది లేకపోవడంతో లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలపై స్పష్టత కరువైంది. రికార్డుల ప్రకా రం 600 ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 180 స్థలాలనే గుర్తించారు. మిగిలిన స్థలాలు సర్వే చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఇందుకు అనుగుణంగా వేగంగా పనులు జరిగేందుకు వీలుగా కొత్త పోస్టులు మంజూరు చేయడంతో పాటు పాత పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.