నేత్రవైద్య సహాయకుల వ్యథలు
రాష్ట్రవ్యాప్తంగా నేత్రవైద్య సహాయకులు అనే క సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. చా లా సంవత్సరాల క్రితం శిక్షణపొందినా ప్రభు త్వ దవాఖానాలలో నేత్రవైద్య సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీచేయడంలో ప్రభు త్వం జాప్యం చేస్తోంది. చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులలో పని చేస్తూ నేత్రదానం పట్ల అవ గాహన కల్గిస్తున్నారు. మానవ శరీరంలో అతి సున్నితమైన అవయవం కన్ను మాత్రమే.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటివారిని గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకునేలా, అవగాహన కలిగించడంలో వీరి సేవలు ఎనలేనివి. ఆఫ్తా ల్మిక్ అసిస్టెంట్లుగా పేరు గడిస్తున్నా, ప్రభు త్వం మాత్రం వీరి సేవలను వినియోగించు కోవడంలేదు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి.
ముప్పిడి రంజిత్ పరకాల, వరంగల్