జగన్‌తోనే సమైక్యాంధ్ర సాధ్యం
నందికొట్కూరుటౌన్,న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సమైక్యాంధ్ర సాధ్యమవుతుందని వ్యవసాయమార్కెట్ యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమైక్యవాదానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుబడి ఉండడం ఆనందకరమన్నారు. ఆయన సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తే ప్రతి ఒక్కరూ కదిలివస్తారన్నారు. జగనన్న జైలు నుంచి బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి సమైక్యవాదుల్లో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు.