నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
రామగుండం : రామగుండం మండలం ముర్మూర్ గ్రామంలో శనివారం సాయంత్రం ఏడాదిన్నర వయస్సు గల పాప ఇంటి ముందున్న నీటిలో పడి మృతి చెందింది. ముర్మూర్కు చెందిన మగ్గిడి భాస్కర్, వనమాల దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ధనశ్రీ సంతానం. సాయంత్రం ధనశ్రీ ఆడుకుంటూ వెళ్లి తమ ఇంటిముందు బోర్వెల్ వద్దనున్న నీటి మడుగులో పడిపోయింది. దీనిని ఎవరూ గమనించలేదు. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. చివరకు తమ ఇంటి ముందున్న నీటి మడుగులోనే ధనశ్రీ శవమై కనిపించింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. వచ్చీరాని మాటలతో సందడిగా తిరిగే పాప నీటమునిగి చనిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.