జస్టిన్ బీబర్ పాటలపై నిషేధం
లాస్ఏంజిల్స్: కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌కు స్వదేశంలో షాక్ తగిలింది. జస్టిన్ సంగీతాన్ని ప్రసారం చేయకుండా ఓ రేడియో స్టేషన్ నిషేధం విధించింది. 'ఒటావా హాట్ 89.9' రేడియో ఈ మేరకు శ్రోతలకు తెలియజేసింది. జస్టిన్ తన పద్ధతి మార్చుకునేంతవరకు అతని పాటలను ప్రసారం చేసేదిలేదని ప్రకటించింది.
19 ఏళ్ల జస్టిన్ లైసెన్స్ లేకుండా డైవింగ్ చేసినందుకు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం కొన్ని గంటల్లోనే బెయిల్‌పై విడుదలయ్యారు. అరెస్ట్ చేసిన సమయంలో జస్టిన్ కోపోద్రిక్తుడై తీవ్ర పదజాలం వాడినట్టు సమాచారం.