muthol constituency
-
కొంపముంచే ‘క్రాస్ ఓటింగ్’
సాక్షి, భైంసా : నేరుగా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే క్రాస్ ఓటింగ్ ఒక్కోసారి సత్ఫలితాలనిచ్చినా.. కొంప ముంచే అవకాశాలే ఎక్కువ! నచ్చిన నాయకున్ని గెలిపించాలనే తాపత్రయంలో లెక్క గానీ తప్పితే.. ఆ నాయకుడు మరో ఐదేళ్ల దాకా పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సిందే! 2009 ఎన్నికలప్పుడు ముథోల్ నియోజకవర్గంలో ఈ విషయమే తేటతెల్లమైంది! 2009 ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేణుగోపాలాచారి, కాంగ్రెస్ అభ్యర్థిగా బోస్లే నారాయణరావు పటేల్, ప్రజారాజ్యం అభ్యర్థిగా విఠల్‌రెడ్డి శాసనసభ బరిలో దిగారు. అప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడంతో లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్, ప్రజారాజ్యం అభ్యర్థిగా నాగోరావు పోటీలో ఉన్నారు. అయితే, టీడీపీ నుంచి పోటీ చేసిన రాథోడ్ రమేశ్ సామాజికవర్గీయుల్లో చాలా మంది విఠల్‌రెడ్డి మద్దతుదారులు. విఠల్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్టు రాకపోవడంతో అంతా కలిసి ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. అప్పుడు తన సామాజికవర్గం ఓట్ల కోసం రాథోడ్ రమేశ్ ప్రజారాజ్యం పార్టీలో చేరిన విఠల్‌రెడ్డి మద్దతుదారుల సాయం కోసం అభ్యర్థించారు. ఇందులో భాగంగా వారిని ఎమ్మెల్యే స్థానానికి ఎవరికి ఓటేసినా.. ఎంపీ స్థానానికి మాత్రం తనకే ఓటేయాలని మాట తీసుకున్నట్లు సమాచారం! దీంతో టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలాచారికి కష్టమొచ్చింది. రాథోడ్ రమేశ్ కూడా అంతా సాఫీగానే జరుగుంతుందని అనుకున్నారు. కానీ, క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ఎవరూ ఊహించలేకపోయారు. తమ సామాజికవర్గ నాయకుడిని ఎంపీగా గెలిపించాలన్న ఆలోచనలో ఓటు వేసేటప్పుడు చాలా మంది ఓటర్లు పొరపాటుపడ్డారు. ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్‌రెడ్డికి అనుకుని వేసిన ఓటు ఎంపీ అభ్యర్థి నాగోరావుకు.. ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు అనుకున్న ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలాచారికి పడ్డాయి. ఫలితాలు వచ్చే వరకు ఈ విషయం ఎవరికీ తెలియరాలేదు. గెలుపు తమదేనని ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో ధీమాగా ఉంది. కానీ, కౌంటింగ్ రోజున అసలు విషయం తేలిపోయింది. 16 మే 2014న ఆదిలాబాద్‌లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విఠల్‌రెడ్డి 183 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ముథోల్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి నాగోరావుకు 6,114 ఓట్లు ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఒకరు గెలుస్తారనుకుంటే ఇంకొకరు గెలిచారు. ఇలా క్రాస్ ఓటింగ్ ఆనాడు తీవ్ర ప్రభావం చూపింది. -
పార్టీల చూపు.. ముథోల్ వైపు
సాక్షి, భైంసా: ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ముథోల్ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపొటములపై ముథోల్ ఓటర్లే ప్రభావంచూపుతారు. ముథోల్ ఓటర్లు ప్రత్యేకంగా తీర్పుచెబుతూ వస్తున్నారు. ముథోల్ నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఆశలుపెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి 83703, బీజే పీకి 40339, కాంగ్రెస్‌కు 36396 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విఠల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో అధికారపార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంపై భారీ ఆశలు పెంచుకుంది. ఇప్పటికే దేవాదయ, ధర్మాదాయ, న్యా య, అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రచారపర్వం ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి కుభీర్, కల్లూరు, భైంసా, ముథోల్, లోకేశ్వరం, తానూరు మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. ముఖ్యకార్యకర్తలతో ప్రత్యేక బేటీలుజరుపుతున్నారు. పా ర్లమెంట్ ఎన్నికల్లోనూ ముథోల్ నుంచి భారీ మెజార్టీ కోసం పావులుకదుపుతున్నారు. భైంసాపైనే... కాంగ్రెస్ పార్టీ డివిజన్ కేంద్రమైన భైంసాపైనే ప్ర త్యేక దష్టిసారించింది. భైంసా పట్టణంలో అత్యధికంగా మైనార్టీ ఓట్లు ఉండడంతో పార్టీ లాభంచేకూరుస్తుందని ఆశలు పెంచుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఎంపీగా, జడ్పీచైర్మన్‌గా ఉన్న సమయంలో తనకంటూ ఉన్న ప్రత్యే క క్యాడర్‌తో ముందుకువెళ్తున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన పవార్ రామారావుపటేల్ సొంత నియోజకవర్గం ముథోల్ కావడంతో ప్రతిష్టాత్మకంగాతీసుకున్నా రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపుతో జోష్ లో ఉన్న పార్టీ శ్రేణులు ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేలా ప్రచారం ముమ్మరంచేశారు. భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగు ఫ్యాక్టరీలో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ప్రచారంచేపడుతున్నారు. యువకుల ఓట్లపై.. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి ర మాదేవి సొంత నియోజకవర్గమైన ముథోల్‌లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సా«ధించేలా పావులుకదుపుతున్నారు. బీజేపీ అభ్యర్థి సో యంబాపురావుతో ఇప్పటికే భైంసా పట్టణంలో ప్రచార కార్యక్రమంచేపట్టారు. నియోజకవర్గ కా ర్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటుచేశారు. ఎ లాగైన బీజేపీకి ముథోల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులుచెబుతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికలకుభిన్నంగా ఎంపీ ఎన్నికల్లో బీజేపీకే ఓట్లువస్తాయని లెక్కలువేస్తున్నారు. ఇలా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లెక్కలువేస్తూ నియోజకవర్గంలో ప్రచార పర్వం ముమ్మరంచేస్తున్నారు. నామినేషన్ల పర్వం ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రచారంపైనే ప్రధాన పార్టీలు దష్టిసారించాయి. దీంతో విజయంపై ఎవరి అంచనాలు వారికున్నాయి. సేవకుడిగా ఉండాలి సమాజంలో గెలిచే ప్రజాప్రతినిధులు సేవకుడిగా ఉండాలి. ప్రజా ఓట్లతో గెలిచినవారు ప్రజా సమస్యలపై పోరాడాలి. అమలుకు నోచుకోని హామిలకు ప్రజలు ఆకర్షితులు కావద్దు. – మాధవ్రావుపటేల్, సిద్దూర్ సమర్థులనే ఎన్నుకోవాలి సమర్థులను ఎంచుకుంటే ప్రాంతం అభివద్ధిచెందుతుంది. ప్రజా సమస్యలపైన పట్టున్నవారిని ఎన్నికల్లో గెలిపించాలి. అలాంటప్పుడే వారు ఆ సమస్యలపై మాట్లాడి పరిష్కారానికి మార్గంచూపుతారు. ప్రతి ఒక్కరు సమర్థులు ఎవరా అని నిర్ధారించుకోవాలి.– రాజేశ్వర్, భైంసా అందుబాటులో ఉండాలి ప్రజా క్షేత్రంలో ఎంతో మంది వచ్చిన అందుబాటులో ఉండేవారు కొందరే. రాత్రైన పగలైన గెలిపించిన వారిని పక్కాగా సేవలు అందించాలి. ఎంతో నమ్మకంతో గెలిపించిన ఓటర్లను మరిచిపోయే వారు ఉండకూడదు. ప్రజలు సైతం బాధ్యతాయుతంగా ఓట్లను వేయాలి. ఓటు హక్కు సద్వినియోగంచేసుకుని అందుబాటులో ఉండేవారిని గెలిపించాలి. పనిచేసేవారికే పట్టం కట్టాలి.– నిఖిల్, తిమ్మాపూర్ -
కేసీఆర్ రాక
20న జిల్లాలో సుడిగాలి పర్యటన తొమ్మిది నియోజకవర్గాల్లో సభలు ఒక్క చెన్నూరు మాత్రం మినహాయింపు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 20న జిల్లాలో పర్యటించనున్నారు. ఒక్క రోజులోనే తొమ్మిది నియోజకవర్గాలను చుట్టి వెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నిచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఒక్క చెన్నూరు నియోజకవర్గాన్ని మాత్రం కేసీఆర్ మినహాయించడం గమనార్హం. అయితే సమయం సరిపోక పోవడంతోనే చెన్నూరు నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహించ లేకపోతున్నామని ఆ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోకభూమారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన కేసీఆర్ పర్యటన వివరాలను వెల్లడించారు.20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కేసీఆర్ ముథోల్ నియోజకవర్గంలోని భైంసా మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్‌కు చేరుకుని బాలుర జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో కూడా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఈసభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 3.40 గంటలకు ఆదిలాబాద్‌లోని డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఉట్నూర్‌కు చేరుకుని అక్కడ సాయంత్రం 4.40కి స్థానిక ఆర్టీసీ గ్రౌండ్లో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.40 గంటలకు కాగజ్‌నగర్ చేరుకుని అక్కడి సిర్పూర్ పేపర్ మిల్లు మైదానంలో ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.40 గంటలకు ఆసిఫాబాద్‌లోని బాలికల పాఠశాల మైదానంలో జరుగనున్న సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు బెల్లంపల్లి చేరుకుని తిలక్ స్టేడియంలో బహిరంగ సభను ముగించుకుంటారు. ఆ తర్వాత మంచిర్యాలకు చేరుకుని డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న సభలో కార్యకర్తలను దిశా నిర్దేశం చేస్తారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం గురువారం అనుమతులు మంజూరు చేసింది. చెన్నూరు నియోజకవర్గంలోని కార్యకర్తలను, ప్రజలను మంచిర్యాల సభకు తరలించాలని భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు.. అధినేత కేసీఆర్ పర్యటనల ద్వారా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ఆ పార్టీ భావిస్తోంది. తొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటించడం ద్వారా జిల్లాలో ఒక్కసారి ఊపు తేవాలని యోచిస్తోంది. ఇప్పుటి వరకు ఆయా నియోజకవర్గాల ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, శ్రేణుల్లో ఆశించిన మేరకు ఉత్సాహం నింపలేకపోతున్నారు. పైగా ప్రచారానికి పెద్దగా సమయం లేకపోవడంతో ఒక్కరోజులోనే జిల్లా అంతటా చుట్టేయాలని నిర్ణయించారు.