సరస్వతీ నిలయం
సక్సెస్ బాటలో సర్కారు బడి
ఆదర్శంగా నిలుస్తున్న ముట్పూరు పాఠశాల
కార్పొరేట్‌కు ధీటుగా విద్యాబోధన
గ్రామస్తుల ప్రోత్సాహం, దాతల సహకారంతో ముందుకు..
సర్కారు స్కూలంటే సాధారణంగా రంగు వెలిసిన గోడలు, లేచిపోయిన గచ్చు, పెచ్చులూడుతున్న శ్లాబు, చెత్తా చెదారాలు తదితర దశ్యాలే కళ్లముందు మెదులుతాయి. కొందుర్గు మండలం ముట్పూరు ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. ఉపాధ్యాయులు అంకితభావంతో వ్యవహరిస్తారు. ప్రతి చిన్నారికి సులభంగా అర్థమయ్యేలా కృషి చేస్తున్నారు. గ్రామస్తుల ప్రోత్సాహంతో పాటు దాతల సాయంతో పాఠశాలను అభివృద్ధిపథంలో దూసుకెళ్తోంది. – కొందుర్గు
ఆరేళ్ల క్రితం ఆ పాఠశాలలో ఎలాంటి వసతులు లేవు. 2010లో ఉన్నత పాఠశాల నుంచి వేరు పడిన తర్వాత ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, గ్రామస్తుల ప్రోత్సాహం, దాతల సహకారంతో దినదినాభివృద్ధి సాధించింది ముట్పూర్ ప్రాథమిక పాఠశాల. పాఠశాల విభజన సమయంలో ఐదు తరగతులకు 75మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. అప్పట్లో పాఠశాల భవనం సరిగా లేదు. కానీ ప్రస్తుతం చక్కటి భవనం, తరగతి గదుల్లో కార్పొరేట్ స్థాయిలో ఆధునాతన ఫర్నీచర్, గ్రంథాలయం, డైనింగ్ హాలు, క్రీడాసామగ్రి, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి కల్పన ఉన్నాయి. ప్రస్తుతం పాఠశాలలో 131మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులున్నారు. అలాగే దాతల సాయంతో మరో ఇద్దరు విద్యా వలంటీర్లను నియమించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో మూడో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు.
దాతల సహకారంతో..
షాద్‌నగర్ పట్టణ వాసవీ వనితా క్లబ్ వారు విద్యార్థులకు టై, బెల్టుల ప్రదానం
లయన్స్ క్లబ్ షాద్‌నగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు
మాజీ సర్పంచ్ మానిక్‌రెడ్డి రూ.40 వేలతో ఫర్నీచర్, విద్యార్థులకు బ్యాగ్‌ల పంపిణీ. ఏడాది పాటు విద్యా వలంటీర్ నియామకం.
కక్కునూరి వెంకటేష్‌గుప్త తాగునీటì æట్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ఏటా నోటుపుస్తకాల పంపిణీ. మహదేవ్పూర్ శ్రీనివాసుగుప్త పాఠశాలకు జాతీయ నాయకుల చిత్రపటాల ఏర్పాటు. గ్రంథాలయ కమిటీ సభ్యుడు అందె జంగరాజు పాఠశాలకు అవసరమైన వైట్బోర్డుల ఏర్పాటు
విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరావు, వీఆర్ఓ ఆనందకిషన్రావు సహకారంతో పాఠశాల గ్రంథాలయంలో టేబుళ్ల ఏర్పాటు. లయన్ రవీందర్‌రెడ్డి రెండు బెంచీల సాయం. షాద్‌నగర్ మలిపెద్ది శ్రీనివాసుగుప్త రూ.20 వేల ఫర్నీచర్, వెంకటరమణ స్టీల్ ప్యాలెస్ కష్ణయ్య మరో రూ.20 వేల ఫర్నీచర్ వితరణ.
డాక్టర్ చైతన్య రూ.10వేల విలువ గల ఇంగ్లిష్ మీడియం పాఠ్యపుస్తకాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ రూ.5వేల విలువ గల బ్యాగ్‌లు, మహికో సేల్స్ ఆఫీసర్ బి.రాజు రూ.7వేలతో మైక్‌సెట్, గ్రామానికి చెందిన నవాజ్ షరీఫ్ పాఠశాలకు రూ.8వేలతో పాఠశాలకు గేటు ఏర్పాటు, గ్రామస్తులు రాజేందర్, పండరి, గొల్ల యాదయ్య, బుయ్యని యాదయ్య, శ్రీనివాసులు సహకారంతో మరో విద్యా వలంటీర్ నియామకం.
పాఠశాల ప్రత్యేకతలు..
క్రమం తప్పని ఎస్ఎంసీ సమావేశాల నిర్వహణ, సమావేశాల్లో విద్యార్థుల ప్రగతి ప్రదర్శన
ప్రతి నెల 1, 3 శనివారాల్లో ఉపాధ్యాయుల సమీక్ష
ప్రతి నెల చివరి శనివారం బాలలసభ నిర్వహణ, ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపాధ్యాయురాలు సాయివాణి సొంత ఖర్చుతో బహుమతుల ప్రదానం.
ఉపాధ్యాయురాలు రమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థులకు సాంస్కతిక ప్రదర్శనలపై అవగాహన.
విద్యార్థులకు ప్రతిరోజు యోగా, ధ్యానం.
భోజన అనంతరం విరామ సమయంలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు గ్రంథాలయ పుస్తక పఠనం.
క్విజ్, సాంస్కతిక కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణ
విద్యార్థుల పొదుపు నిర్వహణ
వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై శ్రద్ధ
పాఠశాల ప్రగతి ఇలా..
2012లో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో పాఠశాలకు చెందిన ఎం.నవనీత జిల్లాలో ద్వితీయస్థానంలో నిలిచింది.
మండలస్థాయి క్విజ్ పోటీల్లో ప్రతి ఏడాది ఈ పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు.
ప్రతిఏటా గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు ప్రతిభ.
గురుకుల ప్రవేశ పరీక్షలో 2013–14లో శైలు, కష్ణవేణి, గాయత్రి, 2014–15లో నందిని, నిఖిత, మౌణిక, 2015–16లో శ్రీకాంత్, వంశి, జి. కల్పన, వైష్ణవి, ప్రణిత, భరణి, కె.నందిని, రేఖ, మౌణిక, మహేష్, శివకుమార్, జగదీష్, మురళికష్ణ, శివలీల, జి.నందిని, పి.కల్పన సీట్లు సాధించారు. అలాగే నిఖిల్‌గౌడ్, భానుప్రకాష్గౌడ్ ఆదిలాబాద్ స్ఫోర్ట్స్ స్కూల్‌కు ఎంపికయ్యారు.
ఆదర్శ పాఠశాల..
ముట్పూర్ ప్రాథమిక పాఠశాలను జిల్లాలోనే ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రుల సంపూర్ణ సహకారం ఉంటే పాఠశాల ప్రగతిపథంలో నడుస్తుంది. ఒకే ఏడాది 18మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో సీట్లు సంపాదించడమే ఇందుకు నిదర్శనం.
– కిష్టారెడ్డి, ఎంఈఓ, కొందుర్గు
బడి బాగుంటే..
గ్రామంలో బడిబాగుంటే గ్రామమంతా బాగుంటుందని నా నమ్మకం. అందుకే బడి అభివృద్ధి కోసం నా వంతు కషి చేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులున్నాయి. ఈ ఏడాది దాతల సహకారంతో రూ.లక్షతో ఫర్నీచర్ సమకూర్చాం. అలాగే భవిష్యత్‌లో డిజిటల్ పాఠశాలగా రూపొందించి జిల్లాలోనే నంబర్‌వన్ చేయాలని ఉంది.
– మానిక్‌రెడ్డి, దాత, మాజీ సర్పంచ్, ముట్పూర్
ప్రాథమిక విద్యనే కీలకం..
విద్యార్థికి విద్యను అభ్యసించడంలో ప్రాథమిక దశనే కీలకం. ఈ పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం, గ్రామస్తుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కషి ఎంతో బాగుంది. మాజీ సర్పంచ్ మానిక్‌రెడ్డి పాఠశాలను దత్తత తీసుకొని పూర్తి సహకారం అందిస్తున్నారు. అందిరి కషితో పాఠశాల ప్రగతిని సాధించడానికి దోహదపడుతోంది.
– మోహన్‌రావు, హెచ్ఎం పీఎస్ ముట్పూర్