నీటిగుంటలో పడి చిన్నారులు మృతి
అదిలాబాద్ : ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిగుంటలో పడి మృతి చెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా భైంసాలో ఆదివారం వెలుగు చూసింది. స్థానిక బైపాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇమ్రాన్ (12), ముజమ్మిల్ ఖురేషి (9) శనివారం పాఠశాల నుంచి వచ్చిన అనంతరం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. వారు మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ క్రమంలో సమీపంలోని నీటికుంట వద్ద చిన్నారుల దుస్తూలు లభించాయి. స్థానికుల సాయంతో గుంటలో వెతకగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. సదరు చిన్నారులు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.