ఏయూ అధ్యాపక సిబ్బంది ఆందోళన
విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) దెయ్యాల కొంప అంటూ టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి, అధ్యాపక, అధ్యాపకేతర, రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దీనిపై ఏయూ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మెయిన్ గేటు ముందు బైఠాయించారు. ఎమ్మెల్సీ మూర్తి తన మాటలను ఉపసంహరించుకోవాలని, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. అలాగే క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు.