యడ్యూరప్ప గెలుపు, స్పెషల్ మైసూర్ పాక్
శివమొగ్గ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, షిమోగా బీజపీ లోక్సభ అభ్యర్థి యడ్యూరప్ప 75వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దాంతో ఆయన ఇంటిలో ప్రత్యేక తీపి పదార్థాలు పెద్ద ఎత్తున తయారు చేశారు. యడ్యూరప్ప గెలుపు ఖాయమని సర్వేలు తేల్చి చెప్పటంతో ఫలితాలు వెలువడక ముందే విజయోత్సహాలకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా శికారిపురలోని యడ్యూరప్ప నివాసంలో స్పెషల్ మైసూర్ పాక్ తయారీ చేసినట్లు సమాచారం. ఫలితాలు వెలువడటంతో స్వీట్లను అభిమానులు, కార్యకర్తలకు అందచేసారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు కూడా విజయోత్సవాలకు రంగం సిద్ధం చేశాయి. యడ్యూరప్ప గెలుపు వార్త విన్నవెంటనే కార్యకర్తలు పెద్త ఎత్తున బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.