2022 కామన్వెల్త్ గేమ్స్ బిడ్డింగ్‌కు దూరం
న్యూఢిల్లీ: 2022 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు బిడ్డింగ్ వేసే ఆలోచన లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా దేశాలు గేమ్స్ నిర్వహణకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ సమయంలో ప్రతిపాదనలు పంపడం కూడా సరికాదని అన్నారు. వాస్తవానికి ఈ గేమ్స్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరగాల్సి ఉన్నా ఆర్థిక కారణాలతో తాము నిర్వహించలేమని చేతులెత్తేశారు. ‘2022 గేమ్స్ కోసం చాలా దేశాలే వరుసలో ఉన్నాయి. అయినా డర్బన్ అశక్తత వ్యక్తం చేసినా ఇంకా అధికారికంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించలేదు.
ఇప్పటికీ కామన్వెల్త్ గేమ్స్ కమిటీ దక్షిణాఫ్రికాతో చర్చలు జరుపుతోంది. లండన్, మాంచెస్టర్, బర్మింగ్హమ్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఇంగ్లం డ్ చెబుతోంది. ఇలాంటి చివరి దశలో ఐఓఏ బిడ్డింగ్‌కు ప్రతిపా దిండం ఆమోదయోగ్యం కాదు’ అని కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్‌ను కలిసిన అనంతరం రామచంద్రన్ తెలి పారు. మల్టీ స్పోర్ట్స్ ఈవెం ట్స్‌ను నిర్వహించేందుకు మాత్రం బిడ్ వేసే ఆలోచన ఉందని చెప్పారు. 90 రోజుల వ్యవధిలోనే శాఫ్ గేమ్స్ నిర్వహించి విజయవంతమయ్యామని ఆయ న గుర్తుచేశారు. మరోవైపు ఈనెల 25 నుంచి 31 వరకు ఢిల్లీ గ్రామీణ్ ఖేల్ మహోత్సవ్ క్రీడలు జరుగుతాయని మంత్రి విజయ్ గోయల్ తెలిపారు.