బన్నీతో బెంగళూరు బ్యూటీ?
‘హలో... హలో... మైక్ టెస్టింగ్!’ అనే పదాలు వినిపిస్తే... భారీ కార్యక్రమం ప్రారంభానికి ముందు సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూసుకుంటున్నారని అర్థం. ‘హలో మేడమ్... ఫేసు రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి! లెఫ్ట్ టర్న్ ప్లీజ్!’ అనే పదాలు సినిమా షూటింగ్‌కి ముందు వినిపిస్తే... హీరో హీరోయిన్ల జోడీ ఎలా ఉంది? కెమిస్ట్రీ ఎలా ఉంది? అనేవి చెక్ చేస్తున్నారని మీనింగ్ అట! అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్న రచయిత వక్కంతం వంశీ ఈ చెకింగ్స్తో బిజీగా ఉన్నారు.
బన్నీకి జోడీగా ఎవరు బాగుంటారు? స్క్రీన్‌పై ఎవరితో కెమిస్ట్రీ కుదురుతుంది అనేవి చూస్తున్నారు. ఈ స్క్రీన్ టెస్టుల్లో బెంగళూరు బ్యూటీ రష్మికా మందన ఆల్మోస్ట్ సెలక్ట్ అయినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. కన్నడ హిట్ ‘కిరిక్ పార్టీ’తో మంచి పేరు తెచ్చుకున్న రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సినిమాతో ఎంట్రీ ఇస్తారా? వెయిట్ అండ్ సీ!