naabard
-
తక్కువ నీటి వినియోగ పంటలపై దృష్టి
న్యూఢిల్లీ: ఎక్కువ లాభదాయకత, తక్కువ నీటి వినియోగం వంటి సౌలభ్యతలున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు దృష్టిని మళ్లించేలా రైతులను ప్రోత్సహించాలని నాబార్డ్‌కు ఆరి్థకశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ఉపన్యాసం చేశారు. గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్థానికంగా సమర్ధత పెంపొందడానికి, చక్కటి ఫలితాలను అందించడానికి కృషి చేయాలని అగ్రి–ఫైనాన్స్ సంస్థకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’’ను పురస్కరించుకుని ’శ్రీ అన్న’ ఉత్పత్తి, మార్కెటింగ్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే తృణధాన్యాల కింద ఉన్న భూమి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే తృణ ధాన్యాలను పండిస్తున్న రైతుల ఆరి్థక ప్రయోజనాల పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేడు చింతన్ శిబిర్... కాగా, కేంద్ర బడ్జెట్, అలాగే ఫ్లాగ్íÙప్ పథకాల నుండి నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి, ఆయా అంశాల సమీక్షకు జూన్ 17న ’చింతన్ శిబిర్’ నిర్వహించినట్లు ఆరి్థక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. -
నికరంగా రూ. 2.02 కోట్ల లాభం
- 2016-17లో డీసీసీబీ లావాదేవీలపై చైర్మన్ మల్లికార్జునరెడ్డి - బ్యాంకు టర్నోవర్‌ను రూ.1340 కోట్లకు పెంచాం - 62 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకారకేంద్రబ్యాంకు 2016-17లో నిర్వహించిన లావాదేవీలపై నికరంగా రూ.2.02 కోట్ల లాభం వచ్చిందని బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. డీసీసీబీకి ఏటా లాభాలు వస్తుండటంతో మొదటి నుంచి ఉన్న నష్టాలు తగ్గుతున్నాయని, మరో రెండు, మూడేళ్లలో నష్టాలను పూర్తిగా అధిగమిస్తామని పేర్కొన్నారు. గత ఏడాది లావాదేవీలపై నాబార్డు స్టాచ్యుటరీ ఆడిట్ పూర్తయి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో చైర్మన్ సోమవారం సీఈఓ రామాంజనేయులుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2015-16లో రూ.1040 కోట్లుగా ఉన్న బ్యాంకు టర్నోవర్ 2016-17కు రూ.1340 కోట్లకు పెరగడం, రికవరీలు మెరుగ్గా ఉండటంతో లాభాలు వచ్చాయని తెలిపారు. ఈ కారణంగా బ్యాంకు నష్టాలు రూ.16.81 కోట్ల నుంచి రూ.14.78 కోట్లకు తగ్గినట్లు చెప్పారు. నిరర్థక ఆస్తులు స్టేట్ యావరేజ్ 5 శాతం ఉండగా డీసీసీబీకి 4.96 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెస్ రేషియో(సీఆర్ఎఆర్) విధిగా 9 శాతం ఉండి తీరాలని, ప్రస్తుతం డీసీసీబీకి 9.61 శాతంగా ఉందన్నారు. 2016-17లో ఆప్కాబ్ లాభాలపై డీసీసీబీకి 5శాతం డెవిడెంట్ రూపంలో రూ.99 లక్షలు విడుదలవుతున్నాయన్నారు. కేడీసీసీబీలో ఉన్న 62 స్టాప్ అసిసెంటు పోస్టుల భర్తీ కోసం మూడు, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. 50శాతం పైగా రికవరి ఉన్న çసహకార సంఘాలకు దీర్ఘకాలిక రుణాల కింద రూ.80 లక్షలు ప్రకారం రూ.56 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రైతు నేస్తం, కర్షకజ్యోతి, పంట రుణాల పంపిణీకి కొత్తగా రూ.200 కోట్ల వరకు రుణాలుగా అందిస్తామన్నారు. రూ.లక్ష చెక్ అందచేత... బండిఆత్మకూరు మండలం పరమటూరు సహకార సంఘంలో సభ్యుడిగా ఉన్న రైతు నాగపుల్లయ్య ప్రమాదవశాత్తు మరణించడంతో వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ.లక్ష చెక్కును మృతుడి భార్య శివలక్ష్మమ్మకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి అందించారు. కార్యక్రమంలో సీఈఓ రామాంజనేయులు, డైరెక్టర్ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.