న్యూఢిల్లీ: ఎక్కువ లాభదాయకత, తక్కువ నీటి వినియోగం వంటి సౌలభ్యతలున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు దృష్టిని మళ్లించేలా రైతులను ప్రోత్సహించాలని నాబార్డ్‌కు ఆరి్థకశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ఉపన్యాసం చేశారు.
గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్థానికంగా సమర్ధత పెంపొందడానికి, చక్కటి ఫలితాలను అందించడానికి కృషి చేయాలని అగ్రి–ఫైనాన్స్ సంస్థకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’’ను పురస్కరించుకుని ’శ్రీ అన్న’ ఉత్పత్తి, మార్కెటింగ్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే తృణధాన్యాల కింద ఉన్న భూమి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే తృణ ధాన్యాలను పండిస్తున్న రైతుల ఆరి్థక ప్రయోజనాల పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
నేడు చింతన్ శిబిర్...
కాగా, కేంద్ర బడ్జెట్, అలాగే ఫ్లాగ్íÙప్ పథకాల నుండి నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి, ఆయా అంశాల సమీక్షకు జూన్ 17న ’చింతన్ శిబిర్’ నిర్వహించినట్లు ఆరి్థక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment