షిర్డీకి పర్యాటక రైలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : మధురై నుంచి కాట్పాడి, చెన్నై, సెంట్రల్, రేణిగుంట, గుంతకల్ మీదుగా షిర్డీకి పర్యాటక రైలు నడుపుతున్నట్లు రేణిగుంట ఐఆర్సీటీసీ మేనేజర్ మధుసూధన్‌రావు, కడప స్టేషన్ మేనేజర్ నాజరుద్దీన్ తెలిపారు. శుక్రవారం వారు సాక్షితో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ రాత్రి మధురైలో ఈ రైలు బయలుదేరుతుందన్నారు. చెన్నై సెంట్రల్, రేణిగుంట, గుంతకల్ మీదుగా 30వ తేదీన షిర్డీ చేరుతుందన్నారు. 31 రాత్రి బాబాను దర్శనం చేసుకోవచ్చన్నారు. అనంతరం పండరీపురం, మంత్రాలయంలో దైవ దర్శనం చేసుకోవచ్చన్నారు. .ఈ రైలులో మొత్తం 15 బోగీలు ఉంటాయన్నారు. స్లీపర్ క్లాస్‌కు రూ 5855 చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9701374932, 9701360620 నంబర్లలో సంప్రదించాలన్నారు.