nacharam police
-
నకిలీ రబ్బరు స్టాంపుల ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: నకిలీ రబ్బరు స్టాంపులు తయారీ చేసి ఎన్వోసీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ముఠా గుట్టును నాచారంలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ రబ్బరు స్టాంపులతోపాటు నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్కు తరలించి... తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. ఎన్ఎఫ్సీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ముఠా ఎన్వోసీలు జారీ చేస్తుందని పోలీసులు తెలిపారు. -
8 మంది బందిపోటు ముఠా సభ్యులు అరెస్ట్
హైదరాబాద్: అంతరాష్ట్ర బందిపోటు ముఠా గుట్టును నాచారం పోలీసులు శనివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన 8 మంది సభ్యులను బోరబండలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షల విలువ చేసే కాపర్ లోడుతో ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్కు తరలించి... తమదైన శైలిలో విచారిస్తున్నారు. రాష్ట్రంలో గతంలో చేసిన నేరాలను పోలీసులు వారి నుంచి రాబడుతున్నారు. రాష్ట్రంలో జరిగిన పలు చోరీలతో వీరికి సంబంధం ఉందని పోలీసులు తెలిపారు.