నాద రేఖలు పుస్తకావిష్కరణ
నాంపల్లి (హైదరాబాద్): శాస్త్రీయ సంగీతానికి మంచి రోజులు వచ్చాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత శంకర్ నారాయణ రేఖా చిత్రాలు, సంగీతాచార్య డాక్టర్ వెజైర్సు బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో రూపొందించిన 'నాద రేఖలు' (సంగీత విధ్వాంసుల రేఖా చిత్రాలు) పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.
పీవీఆర్కే ప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకం 'రిఫరెన్స్'లా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అజ్ఞాత వాగ్గేయకారుల వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సినీనటులు తనికెళ్ల భరణి, పారిశ్రామికవేత్త వరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.