జాతీయ మాస్టర్స్ అ«థ్లెటిక్స్కు నాగబాబు
గంగవరం :
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగి వై.నాగబాబు ఎంపికయ్యారు. శని, ఆదివారాల్లో విజయనగరం జిల్లా ఎస్.కోటలో జరిగిన 37వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపె¯ŒS మీట్– 400, 800, 1500 పరుగు పందేల్లో నాగబాబు బంగారు పతకాలు పొందారు. ఆయన 2017లో కర్నాటకలో మంగుళూరులో జరిగే జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొననున్నారు. 2015లో హర్యానాలో, 2016లో లక్నోలో జరిగిన జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పలు పతకాలను సాధించారు. ఆయనను ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎంపీపీ ప్రభ, జెడ్పీటీసీ సూర్యకాంతం, సర్పంచ్ అక్కమ్మ, డీసీసీబీ డైరెక్టర్ యెజ్జు వెంకటేశ్వరరావు, పీహెచ్సీ వైద్యాధికారి సౌజన్య, సిబ్బంది అభినందించారు.