nagabhushan
-
ఏసీబీకి చిక్కిన ఆర్థిక శాఖ సెక్షన్ అధికారి
సాక్షి, అమరావతి/నగరంపాలెం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లబ్దిదారు నుంచి రూ.40వేలు లంచం తీసుకుంటూ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ(సంక్షేమ విభాగం–2) సెక్షన్ అధికారి ఒంటెద్దు నాగభూషణ్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు నగరం కొరిటెపాడులోని గౌతమినగర్ 4వ వీధికి చెందిన ఒంటెద్దు నాగభూషణరెడ్డి వెలగపూడి ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ భవనం–2 (సంక్షేమం–2)లో సెక్షన్ అధికారిగా ఉన్నారు. మైనార్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దీవెన పథకానికి కర్నూలులోని బాలాజీనగర్‌కు చెందిన మహమ్మద్ నదీమ్ హుస్సేన్ తన కుమారుడు అజంతుల్లా షరీఫ్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో అజంతుల్లా షరీఫ్‌కు సుమారు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన ఉపకార వేతనం విడుదల చేసేందుకు సెక్షన్ అధికారి నాగభూషణరెడ్డి దరఖాస్తుదారు మహమ్మద్ నదీమ్ హుస్సేన్‌ను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కర్నూలు జిల్లాలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. వారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదును బదలాయించారు. ఈ క్రమంలో మహమ్మద్ నదీమ్ హుస్సేన్ శుక్రవారం ఉదయం 10.10 గంటలకు నాగభూషణరెడ్డికి సచివాలయ ఆవరణలోని పార్కింగ్ ప్రదేశంలో రూ.40 వేలు లంచం ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్యాంట్ జేబులోని డబ్బులను స్వా«దీనం చేసుకున్నారు. నాగభూషణ్ రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు తొలుత రూ.10 వేలు ఫోన్ పే చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర మత్తే, అధికారులు పాల్గొన్నారు. -
కన్నడ సినీ నటుడు నాగభూషణ్ అరెస్టు
బెంగళూరు: కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి, ఒక మహిళ మరణానికి కారణమైన కన్నడ సిటీ నటుడు నాగభూషణ్ ఎస్.ఎస్.ను పోలీసులు అరెస్టు చేశారు. నాగభూషణ్ కారు శనివారం రాత్రి బెంగళూరులోని వసంతపుర ప్రధాన రహదారిపై కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులపైకి దూసుకెళ్లింది. వారిద్దరూ ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా ఈ సంఘటన జరిగింది. తర్వాత కారు కొద్ది దూరం వెళ్లి, కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ఈ సమయంలో కారును నాగభూషణ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ప్రేమ మృతిచెందగా, కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కారును నడిపిన నాగభూషణ్‌ను అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకొనేందుకు అతడి రక్తపు నమూనాలు సేకరించామని అన్నారు. కారును స్వా«దీనం చేసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం!
సాక్షి, అమరావతి: జాబిలిపై అన్వేషణకు బయల్దేరిన చంద్రయాన్–3 ఉపగ్రహానికి రక్షణ కవచం తొడిగారు బెజవాడకు చెందిన ఇంజినీరు బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి (బీఎన్ రెడ్డి). ఉపగ్రహంలో గుండెకాయ వంటి అత్యంత కీలకమైన బ్యాటరీలను కాపాడే రక్షణ కవచాన్ని, మరికొన్ని విడిభాగాలను బీఎన్ రెడ్డి స్థాపించిన ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీనే అందించింది. ఉపగ్రహాల్లో బ్యాటరీలకు రక్షణ కవచాల తయారీలో ఈ సంస్ధ దేశంలోనే పేరెన్నికగన్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఈ కంపెనీ ఇప్పటివరకు 50 శాటిలైట్లకు విడి భాగాలను అందించింది. తాజాగా చంద్రయాన్–3లో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్లో బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్‌ను సమకూర్చింది. గతంలో చంద్రయాన్–1, చంద్రయాన్–2తో పాటు ఇస్రో నిర్వహించిన అనేక ప్రయోగాల్లో ఈ సంస్థ భాగస్వామి అయ్యింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాలను కూడా వివిధ విమాన తయారీ సంస్థలకు సమకూరుస్తోంది. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును ఊహించి.. బీఎన్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి విజయవాడ, గన్నవరంలో రైల్వే ఇంజినీరుగా పని చేసేవారు. ఈ క్రమంలోనే బీఎన్ రెడ్డి విద్యాభ్యాసం కేబీఎన్, సిద్థార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాగింది. 1982లో హైదరాబాద్ వెళ్లిన ఆయన ఓ చిన్న పరిశ్రమలో ఉద్యోగిగా చేరారు. అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్, డిజైనింగ్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత అల్విన్ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరారు. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించి 1994లో సొంతంగా ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. తొలినాళ్లలో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసేవారు. 1998 నుంచి ఇస్రో ప్రయోగాలకు అవసరమైన వివిధ ఉపకరణాలను అందించడంపై దృష్టి పెట్టారు. బీఎన్ రెడ్డి పనితీరు, నైపుణ్యాన్ని ఇస్రో ఉన్నతాధికారులు 6 నెలల పాటు పరీక్షించారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అవకాశం కల్పించారు. అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు విశేష కృషి ఒకప్పుడు శాటిలైట్‌లో విడి భాగాల తయారీకి ఉపయోగించే ప్రత్యేక అల్యూమినియాన్ని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇది అధిక సమయం, ఖర్చుతో కూడుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే నాణ్యమైన అల్యూమినియం ప్లాంటు ఏర్పాటు జరిగింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు బీఎన్ రెడ్డి విశేష కృషి చేశారు. దీని ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతున్నాయి. ఇస్రో, నాసాతో భాగస్వామ్యమే లక్ష్యం ‘‘ఇస్రో, నాసాల శాటిలైట్ ప్రయోగాల్లో నా కంపెనీ భాగస్వామ్యం ఉండాలన్నదే నా లక్ష్యం. స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాల తయారీ ద్వారా ప్రయోగాల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చంద్రయాన్–3ని కూడా తక్కువ ఖర్చుతోనే చేపట్టారు. ప్రయోగంలో శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అని బీఎన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
ఊరూరా పశువుల నీటి తొట్టెలు
అనంతపురం టౌన్ : ఈ వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు రంగంలోకి దిగారు. పశుసంవర్ధక, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త సహకారంతో చర్యలు ప్రారంభించారు. ‘వారోత్సవం’ పేరుతో ఊరూరా పశువుల నీటి తొట్టెల నిర్మాణాలు చేపడుతున్నారు. సోమవారం 36 మండలాల్లో నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ నెల 9లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,857 పశువుల నీటి తొట్టెలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు కొత్తగా 1,507 నిర్మించనున్నారు. మొదటి రోజు సాయంత్రానికి 101 గ్రౌండింగ్ చేశారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.25 వేల ఉపాధి హామీ నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.4,250 (17 శాతం) కూలికి, రూ.20,750 (83 శాతం) మెటీరియల్ కోసం వెచ్చిస్తున్నారు. వారం పాటు పనుల పర్యవేక్షణ బాధ్యతను క్లస్టర్ల ఏపీడీలకు అప్పగించారు. వీరు నిత్యం పర్యవేక్షించి రోజువారీ నివేదికను సాయంత్రం నాలుగు గంటల్లోగా అందజేయాలని డ్వామా అధికారులు ఆదేశించారు. సోమవారం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను డ్వామా పీడీ నాగభూషణం, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్ పరిశీలించారు. తొట్టెలకు నీటి సౌకర్యం కోసం కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఎక్కడైతే నీటి సౌకర్యం ఉండి.. కుళాయిలు మరమ్మతు చేయాల్సి ఉందో ఆ పనులన్నీ పంచాయతీ రాజ్ అధికారులు చేపడుతున్నారు. ఇప్పటికే 815 చోట్ల మరమ్మతులు చేశారు. నీటి కనెక్షన్ లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నారు. -
అరక దున్నిన చేతిలో.. ఇస్త్రీ పెట్టె
అనంతపురం: ‘అనంతపురం జిల్లా ఉరవకొండ పరిధిలోని ఆవులన్న గ్రామం మా సొంత ఊరు. ఊరిలో మాకు 16 ఎకరాల పొలం ఉంది. కానీ వ్యవసాయం చేసుకునేందుకు నీటి వనరులు లేవు. బోరు వేసినా చుక్క నీరు రాలేదు. అప్పులు మాత్రం పెరిగాయి. కనీసం బ్యాంకులో ఉన్న అప్పులైనా రుణమాఫీలో తీరతాయని అనుకుంటే నెరవేరలేదు.దీంతో భార్యా బిడ్డలతో బెంగళూరుకు వచ్చి బనశంకరి ప్రాంతంలో ఇస్త్రీ దుకాణం పెట్టుకున్నాను’ - నాగభూషణ్, ఆవులన్న గ్రామం, అనంతపురం.