పర్యాటక ప్రాంతంగా నల్లమల
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ఆత్మకూరు రూరల్: నల్లమలను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి అటవీ రేంజ్లో ( బైర్లూటి)లో ఏర్పాటు చేసిన పర్యావరణ పర్యాటక కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగోడు రిజర్వాయర్, సిద్దాపురం చెరువులో బోటింగ్ అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. నాగలూటి చెంచు గూడేనికి రహదారి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం శ్రీశైలం శాసన సభ్యుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, శాసన మండలి సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. డీఎఫ్ఓ సెల్వం ప్రసంగించారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి జంగిల్ సఫారి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఆహమ్మద్ హుసేన్, ఎకో – టూరిజం సీసీఎఫ్ రమణారెడి, ఎఫ్డీపీటీ శర్వణ్ , ఆత్మకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ బబిత, డీఎఫ్ఓలు యశోదాబాయి, జయచంద్రారెడ్డి, ఏసీఎఫ్ సాయిబాబా, ఆర్డీవో హుసేన్ సాహెబ్, డీఎస్పీ వినోద్ కుమార్, తహసీల్దార్ రాజశేఖరబాబు, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు.