అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గంభీరావుపేట: గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన మందల బాలరాజు(36) అనే వ్యక్తి అప్పుల బాధతో గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే ట్రాక్టర్ కొన్న బాలరాజు అప్పులు ఎక్కువ కావడంతో, అవి తీరే మార్గం కనిపించక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గ్రామశివారులో గురువారం విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.