Nagaratnamma
-
వయసు 62.. పర్వతారోహణ.. ఉన్నతమైన కల
‘కల ఉంటే చాలు అదే వయసును తగ్గిస్తుంది. లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుంది’ అనడానికి నాగరత్నమ్మ అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నారు. బెంగుళూరులో ఉంటున్న నాగరత్నమ్మ వయసు 62. గృహిణిగా బాధ్యతలు తీరి, విశ్రాంతి తీసుకుంటున్న వయసు. కానీ, పశ్చిమ కనుమల్లో ఎత్తైన, అత్యంత కష్టతరమైన పర్వతాన్ని.. అదీ చీరకట్టుతో అధిరోహించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారామె. సంకల్పం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని చాటుతున్నారు. ఇంటి గడప దాటి ఎన్నడూ పర్యటనలు కూడా చేయలేదనే నాగరత్నమ్మను ‘ఈ వయసులో టీవీ చూస్తూ, మనవలు– మనవరాండ్రతో కాలక్షేపం చేయకుండా ఏంటీ సాహసం’ అని తెలిసినవాళ్లు, తెలియనివాళ్లూ అడుగుతుంటే హాయిగా నవ్వేస్తుంది. ఆ తర్వాత తాను ఎందుకు ఈ సాహసానికి పూనుకున్నదో వివరిస్తుంది. ఏళ్ల నాటి తపన పర్వతాలను అధిరోహించాలని తనకు ఇరవై ఏళ్ల వయసున్నప్పుడే కలగన్నదట నాగరత్నమ్మ. కానీ, పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల నడుమ ఆ కల కళ్ల వెనకే దాగిపోయిందని చెబుతుంది. ‘‘కాలప్రవాహంలో నాలుగు దశాబ్దాలు దాటిపోయాయి. పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. బాధ్యతలేవీ లేకపోవడంతో నా కల ముందుకు వచ్చింది. మా అబ్బాయితో చెప్పాను. ముందు సంశయించాడు. ‘ఈ వయసులో పర్వతారోహణ.. అంటే మోకాళ్ల నొప్పులు వస్తాయి, భరించలేవు’ అన్నాడు. ‘నా కల నాలో ఉత్సాహాన్ని, శక్తిని పెంచుతుంది. నేనిలా పర్వతారోహణ చేయడం నా వయసు వాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, కాదనకు’ అని చెప్పాను. అలా 40 ఏళ్ల తర్వాత నా కల నెరవేర్చుకోవడానికి మా అబ్బాయి, అతని మిత్రులతో కలిసి పశ్చిమ కనుమలకు చేరుకున్నాను. ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అంటారు నాగరత్నమ్మ. ఆమె చేసిన ట్రెక్కింగ్‌కి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. సాహసం నాగరత్నమ్మ వయసును తగ్గించింది. ఇప్పుడీ పర్వతారోహణ ఆమెలో మరింత శక్తిని నింపింది. దీంతో ‘మరిన్ని పర్వతారోహణలు చేసి, నా కలను సుసంపన్నం చేసుకుంటాను’ అంటూ తన లక్ష్యాన్ని వివరించే నాగరత్నమ్మను తప్పక అభినందించాల్సిందే! ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. – నాగరత్నమ్మ -
మృత్యువుతో పోరాడి ఓడిన నాగరత్నమ్మ
* 17 రోజులపాటు కోమాలో * దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతులు * భార్య మృతి,భర్త పరిస్థితి విషమం తెనాలి రూరల్: దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన వృద్ధ దంపతుల్లో భార్య మృతి చెందింది. ఇంట్లో ఉన్న సొత్తును అపహరించుకెళ్లేందుకు వచ్చిన దుండగులు ఒంటరిగా ఉన్న దంపతులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపర్చారు. 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన భార్యను మృత్యువు కబళించింది. తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బలభద్రుని వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ (85) తమ స్వగృహంలో నివసిస్తుండేవారు.మే నెల 29వ తేదీన వీరిపై గుర్తు తెలియని దుండగులు విచక్షనా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. మరుసటి రోజు 30వ తేదీ మధ్యాహ్నం వీరికి బట్టలు ఉతికేందుకు వచ్చే బాజి ఇంటికి వచ్చి చూడగా, గ్రిల్స్ లోపలి వైపు తాళం వేసి ఉంది. ఎంత సేపు పిలిచినా స్పందన లేకపోవడంతో అక్కడికి సమీపంలో నివసించే దంపతుల కుమారుడి కుటుంసభ్యులకు తెలియజేసింది. వారు వచ్చి పిలిచినా ఫలితం లేదు. అనుమానం వచ్చి ఇంటి వెనుకకు వెళ్లి చూడగా, తలుపు తీసి ఉంది. లోపల వెంకటనారాయణశాస్త్రి, నాగరత్నమ్మ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న దంపతులు ఇద్దర్నీ తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు సమగ్ర వైద్యశాలకు వైద్యులు పంపారు. ఘటన జరిగిన నాటి నుంచి దంపతులిరువురూ కోమాలో ఉన్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు మార్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో నాగరత్నమ్మ మృతి చెందింది. మృతదేహానికి గుంటూరు సమగ్ర వైద్యశాలలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి, సాయత్రం నాలుగు గంటల ప్రాంతంలో స్వగ్రామం నందివెలుగుకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దుండుగల దాడిలో గాయపడిన వెంకటనారాయణ శాస్త్రి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కళ్లు తెరచి చూడటం మినహా మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పోలీసులకు సవాలుగా మారిన కేసు.. 17 రోజులు గడిచినా కేసులో పురోగతి లేదు. దంపతుల్లో ఎవరైనా పూర్తి స్పృహలోకి వచ్చి సమాచారం చెబితే గానీ కేసు ముందుకు కదలని పరిస్థితి. రూరల్ జిల్లా ఎస్పీ నారాయణ్‌నాయక్ ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసరావును దర్యాప్తు చేసేందుకు నియమించారు. మరో వైపు తెనాలి డీఎస్పీ జీవీ రమణమూర్తి, తాలూకా సీఐ యు. రవిచంద్ర కేసు గురించి ప్రతి రోజు సమీక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. గ్రామంలో బేలుదారి పనికి వచ్చిన వారే చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి, ఈ కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు.