ఆపద్బాంధవులు
శ్రీనగర్‌లో తుపాన్ బాధితులకు సేవలందిస్తున్న నాగర్‌కర్నూలు వైద్య బృందం
నాగర్‌కర్నూల్: జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల వచ్చిన తుఫాన్‌తో అనేకమంది ప్రాణాలు కోల్పో గా, వందలాది మంది నిరాశ్రయులై రోగాలబారిన పడ్డారు. వారిని ఆదుకునేందుకు నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ రాంకిషన్ వైద్య బృం దం గత ఐదు రోజుల నుంచి శ్రీనగర్‌లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి సేవలందిస్తోం ది. ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో రిమ్స్‌లో ఆర్థో ప్రొ ఫెసర్‌గా పనిచేస్తున్న స్థానిక వెన్నెల ఆర్థోపెడిక్ ఆస్పత్రి డాక్టర్ రాంకిషన్ సారథ్యంలో డాక్టర్ల బృందం సేవలందించడానికి ముందుకొచ్చిం ది.
ఈనెల 27న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కు వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాల్లో తు ఫాన్ బాధితుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి మందులను ఉచితంగా అం దిస్తోంది. అక్కడి నుంచి మంగళవారం డాక్టర్ రాంకిషన్ ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడారు. బాధితులకు అక్కడి ప్రభుత్వం సరైన సహాయక చర్యలు చేపట్టలేకపోవడంతో నిరాశ్రయులైన వారు సాయం కోసం ఎదురుచూస్తున్నారని తె లిపారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా ఏడుగురు వైద్యులు పరీక్షలు జరిపి ఉ చితంగా మందులను అందజేస్తున్నామని, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన దుప్పట్లు, దుస్తులు, ఇతర వస్తువులను కూడా బాధితులకు అందజేస్తున్నామని తెలిపారు. తా ను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి *5లక్షల విలువ చేసే మందులను, 2100 దు ప్పట్లు, దుస్తులను సేకరించి పంపిణీ చేసినట్లు చెప్పారు. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు జి ల్లావాసులు మానవతాదృక్పథంతో ముందుకు రావాలని ఆయన కోరారు.