నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఈ సారి గెలుపు ఎవరిదో..!
నాగర్ కర్నూల్ నియోజకవర్గం
నాగర్ కర్నూలు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మర్రి జనార్దనరెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డిపై 54354 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాగం టిడిపిని వీడిన తర్వాత కొంతకాలం బిజెపిలో ఉండి, తదుపరి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ పక్షాన పోటీచేసినా ఫలితం దక్కలేదు. గతంలో నాగం ఆరుసార్లు నాగర్ కర్నూలుకు ప్రాతినిద్యం వహించారు. మర్రి జనార్దనరెడ్డికి 102493 ఓట్లు రాగా, నాగం జనార్దనరెడ్డికి 48139 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి ఎస్.ఎఫ్ బి తరపున పోటీచేసిన సైమన్‌కు ఐదువేలకుపైగా ఓట్లు వచ్చాయి.
2014లో మర్రి జనార్దనరెడ్డి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి, కాంగ్రెస్ ఐ ప్రత్యర్ధి దామోదరరెడ్డిని 14435 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. నాగర్ కర్నూలులో ఆరుసార్లు గెలిచిన నాగం జనార్ధనరెడ్డి 2014లో మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు బిజెపి-టిడిపి కూటమి పక్షాన పోటీచేసి ఓడిపోయారు. నాగర్ కర్నూలులో నాగం కుమారుడు శశిధర్ రెడ్డి 2014లో బిజెపి తరపున అసెంబ్లీకి పోటీచేసి 27789 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ ఐ అభ్యర్ధి దామోదరరెడ్డి ఐదుసార్లు ఓటమి చెందడం విశేషం.
ఐదుసార్లు టిడిపి తరపున గెలిచిన నాగం జనార్దనరెడ్డి 2012లో తెలంగాణ అంశంపై పార్టీతో విబేధించి టిడిపికి గుడ్ బె చెప్పి శాసనసభకు కూడా రాజీనామా చేశారు. తిరిగి ఆయన నాగర్‌కర్నూల్ నుంచి శాసనసభకు ఇండిపెండెంటుగా పోటీ చేసి కాంగ్రెస్ ఐ అభ్యర్థి దామోదం రెడ్డిపైన గెలుపొందారు. నాగం జనార్దనరెడ్డి తదుపరి బిజెపిలో చేరారు. ఆ ఉపఎన్నికలో టిడిపి పక్షాన పోటీచేసిన మర్రి జనార్దనరెడ్డి టిఆర్ఎస్లోకి మారి గెలుపొందారు. 2018లో కూడా ఆయన గెలిచారు. 1952 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, తెలుగుదేశం ఐదుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు, ఇండిపెండెంట్లు రెండుసార్లు విజయం సాధించారు.
1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇద్దరు ఇండిపెండెంట్లే గెలవగ, 1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 1957లో సీనియర్ నేత మహేంద్రనాద్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 1962లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. మహేంద్రనాద్ 1967,1972లలో కాంగ్రెస్ పక్షాన అచ్చంపేటలో, 1983,85లలో టిడిపి తరుపున అచ్చంపేటలోనే గెలిచారు. జిల్లాలో అందరికన్నా ఎక్కువగా ఆరుసార్లు గెలిచిన ఘనత మహేంద్రనాద్కు, అలాగే నాగంకు దక్కింది.
మహేంద్రనాద్ గతంలో పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, ఎన్.టి. రామారావుల క్యాబినెట్లలో మంత్రిగా పనిచేశారు. నాగం జనార్ధనరెడ్డి ఆరుసార్లు గెలిస్తే, వి.ఎన్.గౌడ్ మూడుసార్లు, గౌడ్ కుమారుడు మోహన్‌గౌడ్ ఒకసారి గెలిచారు. జనార్ధనరెడ్డి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. నాగర్ కర్నూల్ నుంచి పది సార్లు రెడ్లు,నాలుగుసార్లు బిసి (గౌడ)ఒకసారి ఇతరులు, మూడుసార్లు ఎస్.సి.నేతలు ఎన్నికయ్యారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..