ఇండియన్ పోలీసు మెడల్‌కు నాగేంద్ర ఎంపిక
అయినవిల్లి : అయినవిల్లి మండలం వీరవల్లిపాలేనికి చెందిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముద్రగడ నాగేంద్రరావు ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. రాష్ట్రపతి ప్రతిభా పురస్కారంగా ఈ అవార్డును నాగేంద్ర వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం నాడు అందుకుంటారు. వీరవల్లిపాలానికి చెందిన నాగేంద్రరావు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన వీరవల్లిపాలెం మాజీ సర్పంచ్ ముద్రగడ వీరేశ్వరరావు కుమారుడు. 1984లో ఏపీఎస్పీలో ఆర్ఎస్సైగా చేరిన నాగేంద్ర 1999 నుంచి చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. నాగేంద్రకు పురస్కారం రావడంపై రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, అయినవిల్లి మం డల పరిషత్ అధ్యక్షుడు సలాది పుల్లయ్యనాయుడు, జెడ్పీటీసీ సభ్యురాలు గంగుమళ్ల కాశీ అన్నపూర్ణ హర్షం వ్యక్తం చేశారు. మెడల్‌కు ఎంపికవడం ఆనందంగా ఉందని హైదరాబాద్‌లోఉన్న నాగేంద్ర ఫోన్లో ‘సాక్షి’కి చెప్పారు.