nagula chavathi
-
పాము ప్రత్యక్షం, భయంతో పరుగులు...
సాక్షి, కాకినాడ : నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అక్కడ నుంచి పరుగులు తీసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం చోటుచేసుకుంది. సోమవారం నాగులచవితి పర్వదినం సందర్భంగా మహిళలు... పుట్టలో పాలు పోసేందుకు వచ్చారు. పూజల చేసిన అనంతరం పుట్టలో పాలు పోయడంతో ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. దీంతో బిత్తరపోయిన మహిళలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భక్తి శ్రద్ధలతో నాగుల చవితి
-
ఘనంగా నాగుల చవితి వేడుకలు
-
ఘనంగా నాగుల చవితి వేడుకలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలోని భక్తులు ఆదివారం నాగులచవితిని వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే మహిళలు, చిన్నారులు పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో నాగేంద్ర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.