మమ్మల్ని అనుమానించారు
మాది అన్నా, చెల్లెలు సంబంధం. మమ్మల్ని అనుమానించారు.. అవమానించారు.. అందుకే ఇద్దరం కలిసి ప్రాణాలు తీసుకుంటున్నాం.. అంటూ సూసైడ్ నోట్‌ను రాసి ఇద్దరు స్నేహితులు సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ సంఘటన మండలంలోని బుడమగుంట క్రాస్‌రోడ్డు సమీపంలో ఉన్న ఓ సమాధి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు సీవీఆర్ మధురానగర్‌కు చెందిన సాపర్ల రవి (27), కాటంగారి నాగూరమ్మ (22) ఇద్దరు స్నేహితులు, ఇద్దరు వివాహితులే. రవి పోర్టులో కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన కాటంగారి నాగూరమ్మకు వివాహమైంది. వీరికి వర్షా అనే మూడేళ్ల కుమార్తె ఉంది. నాగూరమ్మ, రవి సన్నిహితంగా ఉంటున్నారు. ఇది ఇరువురి ఇళ్లలో తెలిసి వివాదం జరిగింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ శనివారం ఇంటి నుంచి మోటారుసైకిల్‌పై కావలికి వచ్చారు. రెండు రోజుల నుంచి కావలి ఏరియా వైద్యశాల పరిస ర ప్రాంతాల్లో తిరుగాడారు.
మండలంలోని బుడమగుంట క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ సమాధి వద్దకు ఆదివారం రాత్రి చేరుకున్నారు. మోనోక్రోటోపాస్ పురుగు మందును దమ్స్ప్ బాటిల్లో కలుపుకుని నాగురమ్మ తాగగా, బీరు బాటిల్లో కలుపుకుని రవి తాగాడు. తాము ఎందుకు చనిపోతున్నామో తెలుపుతూ ఓ నోటు పుస్తకంలో సూసైడ్ నోట్‌ను రాశారు. అయితే పురుగుల మందు తాగిన తర్వాత వారికి బతకాలని ఆశ పుట్టింది. దీంతో ఇద్దరు మోటారు సైకిల్‌పై ఆసు పత్రికి పట్టణంలోకి బయలుదేరారు. ఉదయగిరి బ్రిడ్జిపై సరికి వచ్చే తీవ్ర సరికి అస్వస్థకు గురై కుప్పకూలిపోయారు. గమనించిన రెండో పట్టణ పోలీసులు చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ నాగూరమ్మ మృతి చెందింది. రవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని డీఎస్సార్ వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. అతను నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అనుమానం భరించలేకే..
ముత్తుకూరు : తాను రవితో సన్నిహితంగా ఉంటే తన భర్త వెంకటేశ్వర్లు, అయన చిన్నాన్న, చిన్నమ్మ కాటంగారి వెంకటేశ్వర్లు, పోలమ్మ అనుమానించారు. అందుకే చనిపోతున్నామని సూసైడ్ నోట్లో నాగూరమ్మ రాసింది. ఈ విషయమై నా భర్త నన్ను కొట్టాడు. ఇంటి నుంచి తరిమేశాడు. ఈ విషయాన్ని గ్రామ కాపులకు, పోలీసులకు చెప్పినా తనకు న్యాయం జరగలేదని సూసైడ్ నోట్లో పేర్కొంది. తనకు రవి అన్న వరుస అవుతాడని అందులో పేర్కొంది.
తాను ఏ తప్పు చేయలేదని, తనకు నాగూరమ్మ చెల్లెలు అవుతుందని రవి రాశాడు. అవమానాలు పాలైన తాము ఇద్దరం కలిసి ప్రాణాలు వదలాలని నిర్ణయం తీసుకున్నామని అందులో పేర్కొన్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి ఆత్మహత్య విషయం తెలియడంతో గ్రామానికి చెందిన మత్స్యకారులు కావలికి తరలిపోయారు.