థీమ్‌కి తగ్గట్లు నెయిల్ ఆర్ట్.. ఇంకెన్ని వెరైటీలు వస్తాయో
వేడుకలు సంప్రదాయమైనా పాశ్చాత్యమైనా టాప్ టు బాటమ్ స్పెషల్‌గా కనిపించాలనుకునేవారికి నెయిల్ ఆర్ట్ కూడా తనదైన ముద్ర వేస్తోంది.సందర్భానికి తగిన డిజైన్లతో నఖ శిఖ పర్యంతం ఆకట్టుకోవడానికి కొత్తగా ముస్తాబు అవుతోంది.
వేడుకలకు తగినట్టుగా రెడీ అవడానికి తగిన డ్రెస్‌లను ఎంపికచేసుకుంటాం. అలాగే, వాటికి తగిన మ్యాచింగ్ పట్ల కూడా శ్రద్ధ పెడతాం. అయితే, మరింత ప్రత్యేకత చూపడానికి నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లోనూ శ్రద్ధ తీసుకుంటున్నారు నేటి యువత. ఫ్రెండ్షిప్ డే, ఇండిపెండెన్స్ డే, రక్షాబంధన్, కృష్ణాష్టమి.. వంటి రాబోయే వేడుకలను నెయిల్ ఆర్ట్ డిజైన్స్‌లో చూపుతూ సందర్భానికి తగినట్టుగా రెడీ అవుతున్నారు.
కొనుగోరు చేయవచ్చు!
ఎంత బాగా షేప్ చేసినా, గోళ్లు విరిగిపోవడం సహజంగా జరుగుతుంటుంది. నెయిల్ ఆర్ట్‌తో వేళ్లు అందంగా ఉండాలనుకునేవారు ఆర్టిఫిషియల్ నెయిల్స్‌తో సరికొత్తగా మార్చుకుంటున్నారు. ఈ మోడల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని మన నెయిల్ షేప్‌ను బట్టి, జెల్‌తో సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పాలిష్‌తో డిజైన్ చేసుకోవచ్చు. నచ్చిన డిజైన్ సరైన విధంగా రాదనుకునేవారు నిపుణుల సాయం తీసుకోవచ్చు.
ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
►చేతులకు పెడిక్యూర్‌లో భాగంగా వేలి కొసల్లో క్యుటికల్స్, డెడ్స్కిన్ అంతా క్లీన్ చేసి అప్పుడు మన వేళ్లను బట్టి ఏ షేప్‌లో కావాలో ఆ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అమర్చుకోవాలి. (నెయిల్స్ పెరిగినప్పుడు, వీటిని మళ్లీ క్లియర్ చేసుకోవచ్చు).
►కొన్ని రంగుల నెయిల్ పాలిష్‌లు తెచ్చుకొని, డ్రెస్‌కు లేదా చీరకు మ్యాచ్ అయ్యే రంగును గోళ్లకు వేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు చీర లేదా డ్రెస్ రంగుతో పాటు ఆ డిజైన్‌కు మ్యాచ్ అయ్యే, పండగ థీమ్ ఆర్ట్‌ను నెయిల్స్‌పై ఎంచుకుంటున్నారు. అందుకు నెయిల్ ఆర్ట్ స్పా లు ప్రత్యేకంగా
తోడ్పడుతున్నాయి.