నాలాల పరిశీలనకు బయల్దేరిన మంత్రులు
జంటనగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. దీంతో నాలాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని పరిశీలించేందుకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఉదయాన్నే బయల్దేరారు. మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు బల్కాపూర్ నాలాను, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డబీర్‌పురాకు, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ముషీరాబాద్‌కు, తలసాని శ్రీనివాసయాదవ్ కుత్బుల్లాపూర్‌కు, పద్మారావు లాలాపేటకు బయల్దేరి వెళ్లారు.
మరోవైపు.. భారీ వర్షాల కారణంగా రంగారెడ్డి జిల్లా మొత్తానికి కలెక్టర్ సెలవు శుక్రవారం నాడు ప్రకటించారు. అందువల్ల అందరు ఎంఈఓలు, డివైఈఓలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయాలని రంగారెడ్డి జిల్లా డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.