nallagerla
-
మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లా : ఏపీ మంత్రి కేఎస్ జవహర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్లజర్ల మండలం దూబచర్ల వద్ద ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖామంత్రి జవహర్ కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం జన్మభూమి పర్యటన ముగించుకుని కొవ్వూరు తిరిగివెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ని వెనక నుంచి స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్కార్ట్ జీపు, మంత్రి ప్రయాణిస్తోన్న వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ మంత్రి జవహర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. -
జిల్లాలో 8 మినీ రైతు బజార్లు
నల్లజర్ల : జిల్లాలో 8 మినీ రైతు బజార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ కె.ఛాయదేవి తెలిపారు. నల్లజర్లలో ఏర్పాటు చేయనున్న మినీ రైతుబజారుకు స్థలం స్వాధీనం చేసుకోవడానికి ఆమె గురువారం నల్లజర్ల వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గతంలో 6 మునిసిపాలిటీల్లో ఉన్న రైతు బజార్లు గాక నల్లజర్ల, తాడేపల్లిగూడెం(కడకట్ల), తణుకు, నిడదవోలు, చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలలో ఈ మినీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నాలుగుచోట్ల స్థలసేకరణ పూర్తయిందని, ఆన్లైన్ టెండర్ల ద్వారా పనులు కూడా ప్రారంభించినట్టు చెప్పారు. ఒక్కో మినీ రైతు బజారులో షెడ్లు, తదితర ఏర్పాట్లకు రూ.6 లక్షల చొప్పున కేటాయించినట్టు వివరించారు. 17 మార్కెట్ యార్డుల పరిధిలో రూ.22 కోట్ల 35 లక్షలతో 334 పుంత రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో రూ.11 కోట్ల 17 లక్షలు మార్కెటింగ్ శాఖ అందిస్తుండగా మరో రూ. 11 కోట్ల 17 లక్షల ఉపాధి హామీ నిధుల ద్వారా ఈ పనులు చేపడతారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు రవాణాపై 1 శాతం పన్ను రూ.69 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఆగస్ట్ నెలాఖరు నాటికి రూ.23 కోట్లు వసూలు చేశామన్నారు. రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్ యార్డులో నిల్వ చేసుకునే సందర్భంలో ఆ పంట విలువపై 75 శాతం రుణ సహాయం (రూ.2 లక్షలు మించకుండా) అందిస్తున్నామన్నారు. ఈ విధంగా ఇంతవరకు 236 మంది రైతులకు రూ.3 కోట్ల 58 లక్షలు రుణ సహాయంగా అందించినట్టు చెప్పారు. 152 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు, తేమ శాతం పరీక్షించే మిషన్లు అందించినట్టు వివరించారు. -
జిల్లాలో 8 మినీ రైతు బజార్లు
నల్లజర్ల : జిల్లాలో 8 మినీ రైతు బజార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖ ఏడీ కె.ఛాయదేవి తెలిపారు. నల్లజర్లలో ఏర్పాటు చేయనున్న మినీ రైతుబజారుకు స్థలం స్వాధీనం చేసుకోవడానికి ఆమె గురువారం నల్లజర్ల వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గతంలో 6 మునిసిపాలిటీల్లో ఉన్న రైతు బజార్లు గాక నల్లజర్ల, తాడేపల్లిగూడెం(కడకట్ల), తణుకు, నిడదవోలు, చింతలపూడి, లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలలో ఈ మినీ రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నాలుగుచోట్ల స్థలసేకరణ పూర్తయిందని, ఆన్లైన్ టెండర్ల ద్వారా పనులు కూడా ప్రారంభించినట్టు చెప్పారు. ఒక్కో మినీ రైతు బజారులో షెడ్లు, తదితర ఏర్పాట్లకు రూ.6 లక్షల చొప్పున కేటాయించినట్టు వివరించారు. 17 మార్కెట్ యార్డుల పరిధిలో రూ.22 కోట్ల 35 లక్షలతో 334 పుంత రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో రూ.11 కోట్ల 17 లక్షలు మార్కెటింగ్ శాఖ అందిస్తుండగా మరో రూ. 11 కోట్ల 17 లక్షల ఉపాధి హామీ నిధుల ద్వారా ఈ పనులు చేపడతారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు రవాణాపై 1 శాతం పన్ను రూ.69 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఆగస్ట్ నెలాఖరు నాటికి రూ.23 కోట్లు వసూలు చేశామన్నారు. రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్ యార్డులో నిల్వ చేసుకునే సందర్భంలో ఆ పంట విలువపై 75 శాతం రుణ సహాయం (రూ.2 లక్షలు మించకుండా) అందిస్తున్నామన్నారు. ఈ విధంగా ఇంతవరకు 236 మంది రైతులకు రూ.3 కోట్ల 58 లక్షలు రుణ సహాయంగా అందించినట్టు చెప్పారు. 152 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు టార్ఫాలిన్లు, తూకం యంత్రాలు, తేమ శాతం పరీక్షించే మిషన్లు అందించినట్టు వివరించారు.